జాతీయ వార్తలు

అలాంటి కోడళ్లే కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 12: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది సామెత. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ భార్య రబ్రీ దేవి అక్షరాలా ఇదే పద్ధతి పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. బిహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తన ఇద్దరు కుమారులు తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్వి ప్రసాద్ యాదవ్‌లకు ఎలాంటి అమ్మాయిలు భార్యలుగా రావాలని కోరుకుంటున్నారో కూడా ఆమె బహిరంగంగానే ప్రకటించారు కూడా. లాలూప్రసాద్ 70వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం మీడియా వాళ్లు మీ ఇద్దరు కుమారులకు ఎలాంటివాళ్లు భార్యలుగా రావాలనుకుంటున్నారని ప్రశ్నించగా, సినిమా హాళ్లకు వెళ్లేవాళ్లు, షాపింగ్ మాల్స్ చుట్టూ తిరిగేవాళ్లు నా కొడుకులకు అక్కర్లేదు. నా లాగా పెద్దవాళ్లను గౌరవించే, ఇంటిపట్టునే ఉండే ‘సంప్రదాయక’ అమ్మాయిలే కావాలి’ ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ కుమారులకోసం తాము చాలా అమ్మాయిల ఫోటోలను చూశామని, అయితే వాళ్లలో చాలామంది తనకు నచ్చలేదని, అందుకే వాటిని తన కొడుకులకు కూడా చూపించలేదని రబ్రీ దేవి చెప్పారు. కాగా, ఇదే విషయమై లాలూ కుమారులను అడగ్గా, తమకు ఎలాంటి కోడళ్లు కావాలో తమ తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారంటూ వారు సమాధానం చెప్పడం గమనార్హం.