జాతీయ వార్తలు

రిటైర్మెంట్‌లోనూ జస్టిస్ కర్ణన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షలు విధించి, ఆపై కోర్టు ధిక్కరణ నేరానికి సుప్రీంకోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించడంతో పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ రిటైర్మెంట్‌లోను సరికొత్త రికార్డు సృష్టించారు. సోమవారం ఆయన కోల్‌కతా హైకోర్టు జడ్జిగా రిటైరయ్యారు. కర్ణన్ లేకపోవడం వల్ల రిటైరవుతున్న జడ్జి కోసం హైకోర్టు అధికారులు సంప్రదాయం ప్రకారం ఇచ్చే వీడ్కోలు కార్యక్రమం జరగలేదని కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుగతో మజుందార్ చెప్పారు. రిటైర్ అయ్యాక కర్ణన్‌కు చెల్లించాల్సిన బకాయిల గురించి అడగ్గా, చట్టప్రకారం అన్ని లాంఛనాలు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రిటైరవుతున్న జడ్జికి లాయర్లు (బార్) కూడా వీడ్కోలు ఇవ్వడం సంప్రదాయం. జస్టిస్ కర్ణన్ గనుక ఇక్కడ ఉండి ఉంటే బార్ కూడా ఆయనకు వీడ్కోలు ఇచ్చే విషయాన్ని పరిశీలించేదని, అయితే ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియనందున ఆ ప్రశే్న ఉత్పన్నం కాలేదని అదనపు అడ్వకేట్ జనరల్ అభ్రతోష్ చౌదరి చెప్పారు. కోర్టు ధిక్కరణ నేరం కింద ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత నెల 9న జస్టిస్ కర్ణన్‌కు ఆరునెలల జైలుశిక్ష విధిస్తూ ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించడం తెలిసిందే. కర్ణన్ చెన్నైలోనే ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ కోల్‌కతానుంచి వచ్చిన పోలీసు బృందం దాదాపు నెల రోజులుగా నగరంలోనే ఉన్నప్పటికీ ఆయన జాడను కనిపెట్టలేకపోయింది.