జాతీయ వార్తలు

శేఖర్‌రెడ్డి నుంచి 50 కిలోల బంగారం అటాచ్ చేసిన ఇడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 13: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, తమిళనాడు ఇసుక మైనింగ్ వ్యాపారి జె శేఖర్ రెడ్డిపై జరుపుతున్న మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన 50 కిలోల బరువుండే బంగారు దిమ్మలు, గోల్డ్ బార్‌లను అటాచ్ చేసింది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత శేఖర్ రెడ్డి నివాసంలో కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ, బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనపై నమోదు చేసిన కేసు కింద జరిపిన సోదాల్లో పట్టుబడిన ఈ బంగారాన్ని అటాచ్ చేసినట్లు ఇడి తెలిపింది. 49.48 కిలోల బరువుండే ఈ బంగారం విలువ 13.96 కోట్ల పైమాటేనని ఆ ప్రకటన తెలిపింది. ఇదికాక ఇప్పటివరకు ఇడి రూ.10 కోట్ల విలువైన రద్దయిన పెద్ద నోట్లు, 6.5 కిలోల కరిగించిన బంగారం. రూ.34 కోట్ల కొత్త కరెన్సీ, 30 కిలోల బంగారాన్ని కూడా అటాచ్ చేసిందని తెలిపింది.