జాతీయ వార్తలు

800 జిల్లా పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూన్ 13: జనానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వారికి పాస్‌పోర్టు సదుపాయాన్ని మరింత చేరువ చేయడం కోసం రాబోయే రెండేళ్లలో దేశంలోని 800 జిల్లా ప్రధాన పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ మంగళవారం ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది 150 పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభిస్తారని, రాబోయే రెండేళ్లలో మొత్తం 800 జిల్లాల్లోని అన్ని ప్రధాన పోస్ట్ఫాసుల్లోను ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ‘పాస్‌పోర్టుకోసం ఏ పౌరుడు కూడా సుదూర ప్రయాణం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన జనం పాస్‌పోర్టులు పొందాలన్నా, పాస్‌పోర్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది’ అని ఆయన చెప్పారు. విదేశాంగ శాఖ, తపాలా విభాగం సంయుక్తంగా చేపట్టిన కృషి కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం కింద పాస్‌పోర్టులకు సంబంధించిన సేవలను అందించడానికి దేశంలోని జిల్లా ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఇప్పటికే పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మొదట్లో చేపట్టిన రెండు పైలట్ ప్రాజెక్టులు విజయవంతంగా కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.