జాతీయ వార్తలు

సరిహద్దు వద్ద జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, జూన్ 13: భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి పహారా కాస్తున్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది తమ విధుల నిర్వహణలో మరింత ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని, తద్వారా మయన్మార్‌తో భారత్‌కు గల సుహృద్భావ సంబంధాలు దెబ్బతినకుండా చూడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అస్సాం రైఫిల్స్ 46వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘సైనిక సమ్మేళన్’లో ఆయన ప్రసంగిస్తూ, మయన్మార్‌తో భారత్‌కు ఎంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, కనుక ఆ దేశ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పహారా కాస్తున్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది మరింత ముందు జాగ్రత్తతో వ్యవహరించి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూడాలని కోరారు. మూసివేసి ఉన్న సరిహద్దు వెంబడి పహారా కాయడంతో పోలిస్తే, మయన్మార్-్భరత్ మధ్య పూర్తిగా తెరిచి ఉన్న సరిహద్దు వెంబడి పహారా కాయడం ఎంతో కష్టమైన పని అని, ఈ పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలంటే ఎంతో తెలివి, ఓపిక, ధృఢ సంకల్పం అవసరమని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చిత్రం.. మిజోరంలోని ఐజ్వాల్‌లో మంగళవారం నిర్వహించిన సైనిక సమ్మేళన్‌లో
ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్