జాతీయ వార్తలు

ఏ క్షణంలోనైనా కుమారస్వామి అరెస్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 13:అవినీతి కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి అరెస్టుకు రంగం సిద్ధమైంది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరు కోర్టు మంగళవారం తిరస్కరించడంతో ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కుమారస్వామి ‘నేనేమీ భయపడాల్సింది లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. న్యాయమే గెలుస్తుంది’అని అన్నారు. 2006-07లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి జనతాకాల్ ఎంటర్‌ప్రైజెస్ అనే ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చే విధంగా ఓ మైనింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని లోకాయుక్త నిగ్గుదేల్చింది. నకిలీ పత్రాల ఆధారంగా ఈ సంస్థకు 40ఏళ్ల పాటు మైనింగ్ లీజు ఇవ్వాలంటూ కుమారస్వామి ఓ సీనియర్ అధికారిపై వత్తిడి తెచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. గంగారామ్ బదెరియా అనే ఆ అధికారికి సదరు సంస్థ భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్టుగా తెలుస్తోంది. ఫోర్జరీ ఆరోపణలపై ఈ సంస్థ అధినేత వినోద్ గోయల్‌ను 2015లోనే అరెస్టు చేశారు.

చిత్రం.. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి