జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో రెచ్చిపోయన ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 16: జమ్మూ, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై భారీ ఆయుధాలు ధరించిన మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక స్టేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అచబల్ గ్రామం వద్ద సాయుధ మిలిటెంట్లు పోలీసు వాహనంపై దాడి చేశారు. వాహనంలోని అంతమందిని చంపేసిన తర్వాత మిలిటెంట్లు వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని పారిపోయారు. కాగా, అనంత్‌నాగ్‌లోని అర్వానీ వద్ద శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ దాడి జరిపి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఒక భవనంలో దాగిన లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది జునైద్ మట్టూను భద్రతా దళాలు ఆ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే. గాలింపు ఆపరేషన్ కొనసాగుతూ ఉండడంతో అతని మృతదేహాన్ని ఇంకా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నప్పుడు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని భద్రతా వలయాన్ని ఛేదించి మిలిటెంట్లు తప్పించుకొని పోయేలా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో ఒక టీనేజర్ సహా ఇద్దరు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.