జాతీయ వార్తలు

అబూ సలేం దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 16: దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కుదిపేసిన 1993 నాటి వరస బాంబు పేలుళ్ల కేసులో శుక్రవారం టాటా ప్రత్యేక కోర్టు ఈ కేసులో ప్రధాన నిందితులయిన ఉగ్రవాదులు అబూ సలేం, ముస్త్ఫా దోస్సా సహా ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. కుట్ర ఆరోపణలు, హత్య, ఉగ్రవాద కార్యకలాపాలు తదితర ఆరోపణల కింద వీరిని దోషులుగా నిర్ధారించారు. కాగా, వీరికి విధించే శిక్షలను సోమవారం ప్రకటిస్తారు. ఏడుగురిపై విచారణ జరిపిన కోర్టు సరయిన సాక్ష్యాధారాలు లేని కారణంగా అబ్దుల్ ఖయూమ్‌ను నిర్దోషిగా విడిచిపెట్టింది. 1993 మార్చి 12న ముంబయిలోని 13 చోట్ల వరసగా జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోగా, దాదాపు 700 మంది గాయపడిన విషయం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్‌డిఎక్స్‌ను భారీ ఎత్తున ఉపయోగించి పేలుళ్లు జరిపిన ఘటన ఇదే కావడం గమనార్హం. ఈ కేసులో టాడా కోర్టు 2007లో తొలి విడత విచారణను పూర్తి చేసింది. వందమందిని దోషులుగా నిర్ధారించి 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ కేసులో విచారణ పూర్తయిన తర్వాత అబూ సలేం, ముస్త్ఫా దోస్సా, మహమ్మద్ తాహిర్ మర్చంట్ అలియాస్ తాసిర్ తక్లా, కరీముల్లా ఖాన్, రియాజ్ సిద్దీఖి, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, అబ్దుల్ ఖయ్యామ్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అబూ సలేంను 2005లో పోర్చుగల్‌నుంచి భారత్‌కు తీసుకు రాగా, దోస్సాను యుఏఇనుంచి తీసుకు వచ్చారు. దీంతో ఈ కేసులో రెండో విడత విచారణ ప్రారంభమయింది. రెండో దశ విచారణలో అబూ సలేం, ముస్త్ఫా సహా ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు సరయిన సాక్ష్యాధారాలు లేని కారణంగా అబ్దుల్ ఖయ్యూమ్‌ను విడిచిపెట్టింది. గుజరాత్‌నుంచి ముంబయికి ఆయుధాలు
తరలించాడన్న ఆరోపణలపై అబూ సలేంను అరెస్టు చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కూడా అబూ సలేం ఆయుధాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆర్‌డిఎస్ పేలుళ్లలో ముస్త్ఫా కీలక పాఅత పోషించాడన్నది ప్రధాన ఆరోపణ. 2007లోనే వీరిపై కోర్టు విచారణ ప్రారంభించింది. అయితే కొన్ని కారణాల వల్ల 2012లో విచారణను ఆపేసింది. ఆ తర్వాత 2012లో తిరిగి విచారణ ప్రారంభించింది. ఇదే కేసులో 2015లో యాకూబ్ మెమన్‌ను ఉరి తీసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా కోర్టు దాదాపు 750 ప్రాసిక్యూషన్ సాక్షులు, 50 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. విచారణ సమయంలో అబూ సలేం సహా ముగ్గురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

చిత్రం.. అబూ సలేం