జాతీయ వార్తలు

పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: పాస్ పోర్టు సేవలను నేరుగా పోస్ట్ఫాసుల్లో అందించేందుకు విదేశీ మంత్రిత్వశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా మరో 149 పట్టణాల్లో పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఏడు, తెలంగాణలో ఐదు పట్టణాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. పాస్‌పోర్టుకు సంబంధించిన అన్ని సేవలను ఈ కేంద్రాల్లో అందిస్తారు. తొలి దశలో 86 సేవా కేంద్రాలను ప్రారంభించిన విదేశీ మంత్రిత్వశాఖ అందులో 52 కేంద్రాలను అమలులోకి తెచ్చింది. మరో 34 కేంద్రాలు తమ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మంచి ఫలితాలు రావడంతో మరో 149 కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు 235కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లా విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం పట్టణాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. అలాగే తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్ధిపేట, నల్గొండలలో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, అస్సాంలో 9, బీహార్‌లో 9, చత్తీస్‌గఢ్‌లో 2, గుజరాత్‌లో 8, హర్యానాలో 7, హిమాచల్ ప్రదేశ్‌లో 3, జమ్మూలో 3, జార్ఖండ్‌లో 3, కర్నాటకలో 7, కేరళలో 2, ఎంపిలో 9, మహారాష్టల్రో 11, మేఘాలయలో రెండు, ఒడిస్సాలో 3, పంజాబ్‌లో 5, పుదుచ్చేరిలో 1, రాజస్థాన్‌లో 11, తమిళనాడులో 11, ఉత్తరాఖండ్‌లో 3, యుపిలో 19, బెంగాల్‌లో 4, ఢిల్లీలో 3 కేంద్రాలు ఏర్పాటవుతాయి.