జాతీయ వార్తలు

రైతు ఆదాయం రెట్టింపు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వదోదర, జూన్ 17: దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం కార్యచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపుచేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్టు శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకోడానికి వీలుగా ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేయనున్నట్టు జవడేకర్ ప్రకటించారు. ఏడు అంశాల కార్యక్రమానికి మోదీ గత ఏడాదే శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. నీటిపారుదల రంగాన్ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఎన్‌డిఏ ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యవసాయ దిగుబడులు పెంపు అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పన వంటి అంశాలు ప్రధానమైనవి’ అని జావడేకర్ తెలిపారు.
గుజరాత్‌లోని ఆనంద్‌లో మూడు రోజుల పాటు జరిగే ‘మేకింగ్ ఆఫ్ డెవలప్‌డ్ ఇండియా మేళా’ కార్యక్రమాన్ని జావడేకర్ ప్రారంభించారు. ఇరిగేషన్ రంగానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉంటాయని, ‘పెర్ డ్రాప్.. మోర్ క్రాప్’ లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు, పోషకాలు అందచేస్తూ భూములను సేద్యానికి అనువుగా తయారు చేస్తామని తద్వారా అధికోత్పత్తిని పెంపొందించేందుకు వీలుంటుందని మంత్రి అన్నారు. గిట్టుబాటు ధర కల్పించడం అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్, కోల్డ్ స్టోరేజీ సదుపాయం రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పంటల బీమా పటిష్టం చేయడంతోపాటు కోళ్ల, మత్స్య పరిశ్రమను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.