జాతీయ వార్తలు

లాలూ కుమారుడి పెట్రోలు బంకు లైసెన్స్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోలు బంకు లైసెన్స్‌ను బిపిసిఎల్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నామని వెల్లడించింది. అయితే బిపిసిఎల్ చర్యను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఆర్‌జెడి వర్గాలు వెల్లడించాయి. నకిలీ పత్రాలతోనూ తేజ్ ప్రతాప్ ఈ బంకును పొందారంటూ దాఖలైన ఫిర్యాదును పురస్కరించుకుని గత నెల 29న ఆయనకు బిపిసిఎల్ షోకాజ్ నోటీసు పంపింది. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే లైసెన్స్‌ను రద్దు చేస్తామనీ హెచ్చరిస్తూ ఇందుకు పదిహేను రోజుల గడువు ఇచ్చింది. అయితే తేజ్ ప్రతాప్ ఇచ్చిన వివరణ ఎంత మాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయనకు ఇచ్చిన బంకు లైసెన్స్‌ను రద్దు చేసింది. ఈ చర్యను రాజకీయ కక్ష సాధింపుగా ఆర్‌జెడి అభివర్ణించింది. బిజెపి నేతలెందరికి పెట్రోలు బంకులు ఉన్నాయో బయటికి తీస్తామనీ హెచ్చరించింది.