జాతీయ వార్తలు

పోలీసులపై కాల్పులు పిరికిపంద చర్య: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అఛాబాల్‌లో మిలిటెంట్లు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. నిరాయుధులుగా ఉన్న ఆరుగురు పోలీసులను మిలిటెంట్లు కాల్చి చంపడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. ఆయుధాలు లేకుండా వెళ్తున్న పోలీసులపై దాడి జరపడం పిరికిపంద చర్యగా ఆయన పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని అఛాబాల్‌లో మిలిటెంట్ల కాల్పుల్లో పుల్వామాకు చెందిన ఫిరోజ్ అహ్మద్ డర్ అనే ఎస్సై, జీపు డ్రైవర్, నలుగురు పోలీసులు మృతిచెందారు. జీపుపై రోజువారీ గస్తీకి వెళ్తుండగా మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ‘ఆరుగురు పోలీసుల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాల్పుల్లో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.
అమర పోలీసులకు మా సలామ్‌లు’ అని జైట్లీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అర్వానీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అర్వానీ ఎన్‌కౌంటర్‌లో మిలిటెంట్ల కమాండర్ జునైద్ మట్టూ మృతి చెందాడు.

చిత్రం.. సైనిక అధికారులతో కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ