జాతీయ వార్తలు

పాకిస్తాన్ గడ్డపై భారత్ ఆడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 17: దాయాదులు ఇకపై ఒకరితో ఒకరు సొంత గడ్డపై తలపడే అవకాశాలే లేవని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీ బలోపేతానికి గాను మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. దాయాదుల మధ్య ఆదివారం ఇంగ్లండ్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై ఇరు దేశాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అమిత్ షా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడైన అమిత్ షా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్యనున్న క్రీడా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న రాష్టప్రతి ఎన్నికలకు ఎన్‌డిఏ అభ్యర్థిని నిర్ణయించేందుకు మిత్ర పక్షాలతో చర్చలు జరపనున్నట్టు అమిత్ షా తెలిపారు. మిత్ర పక్షాలతో చర్చలు జరిపిన పిదపే అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. రాష్టప్రతి ఎన్నికలకు అభ్యర్థిగా ఎంఎస్ స్వామినాథన్ పేరును శివసేన తేవడం, బిజెపి దీనికి అనుకూలంగా స్పందించక పోతే తమ పార్టీ తరఫున స్వామినాథన్‌ను పోటీలో నిలుపుతామన్న వార్తల నేపథ్యంలో అమిత్ షా పై విధంగా స్పందించారు. మహారాష్టల్రో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేం ద్ర ఫెడ్నవీస్ చేసిన ప్రకటనపై మీ స్పం దన ఏమిటని విలేఖరులు అడిగిన ప్రశ్న కు సమాధానమిస్తూ, మధ్యంతరం అనివార్యమైతే తప్పకుండా ఎన్నికలకు వెళతామన్నదే ఫెడ్నవిస్ ఉద్దేశమని అమిత్ షా పేర్కొన్నారు. రాష్టప్రతి అభ్యర్థి ఎంపిక విషయమై శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను ఆయన కలువనున్నారు. 2022నాటికి భారత్‌ను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మోదీ కృషి చేస్తున్నారని చెప్పా రు. మోదీ సారథ్యంలోప్రపంచంలో ఆర్థికపరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ పురోగమిస్తోందని అన్నారు. జిఎస్‌టిని ప్రవేశపెట్టి ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ధీశాలి మోదీ అని కొనియాడారు.