జాతీయ వార్తలు

2 క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: వచ్చేనెలలో పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రెండు క్షమాభిక్ష అభ్యర్థనలను తిరస్కరించినట్టు తెలిసింది. మే నెలాఖరున రెండు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించినట్టు ఓ ఆంగ్ల దినపత్రి వెల్లడించింది. ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్లలో అత్యాచారం, కిడ్నాప్ కేసులో మరణశిక్ష పడ్డ నేరస్తులవే. 2012 జూన్ 24న ఇండోర్‌లోని సోమనాథ్‌కి జునీ చావ్లా ప్రాంతంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో జీతు (21), బాబు అలియాస్ కేతన్ (27), సన్నీ అలియాస్ దేవేంద్ర (24)లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఓ వివాహ వేడుకను చూస్తు న్న నాలుగేళ్ల బాలికను ఈ ముగ్గురూ నిర్మానుష్య ప్రాంతానికి కిడ్నాప్ చేసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసిన తరువాత గొంతునులమి చంపేశారు. మరోకేసు 2007లో పూణేలో జరిగింది. విప్రోలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిని పురుషోత్తం దశరథ్ బొరాటే, ప్రదీప్ యశ్వంత్ కొకాడేలు దారుణంగా హత్యచేశారు. రాత్రి షిప్పు ముగించుకుని వస్తూ ఓ క్యాబ్ ఎక్కింది. దీన్ని ఆసరా చేసుకుని క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్‌చేసి చంపేశారు. ఈ రెండు కేసుల్లో మరణశిక్ష పడ్డ నేరస్తులు క్షమాభిక్ష కోసం రాష్టప్రతిని ఆశ్రయించారు. అయితే రాష్టప్రతి రెండు పిటిషన్లనూ తిరస్కరించారు. రాష్టప్రతి ఐదేళ్ల పదవీకాలంలో అతిముఖ్యమైన క్షమాభిక్ష పిటిషన్లనే తిరస్కరించారు. 26/11 ముం బయి ఉగ్రదాడిలో ముద్దాయి కసబ్, పార్లమెంటుపై దాడి కేసులో ముద్దాయి అఫ్జల్‌గురు, 1993 నాటి ముంబయి పేలుళ్లలో ముద్దాయి యాకుబ్ మెమన్‌ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్టప్రతి తిరస్కరించారు.