జాతీయ వార్తలు

ప్రగతికి దర్పణంగా పట్టణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, జూన్ 17: కేరళలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఉదయం పది గంటలకు కొచ్చిలోని ఐఎన్‌ఎస్ గరుడ నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని అక్కడినుంచి పలరిపట్టం చేరుకున్నారు. అక్కడ ఆయన మెట్రో తొలి దశకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పట్టణ ప్రణాళికలో సమూల మార్పు రావలసిన అవసరం ఉందన్నారు. గత మూడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. ‘ప్రగతి’ సమావేశాల్లో తాను స్వయంగా 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన దాదాపు 175 ప్రాజెక్టులను సమీక్షించి ఇబ్బందులను పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. తన ప్రసంగాన్ని మలయాళంలో ప్రారంభించిన ప్రధాని కొచ్చి మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు తానెంతో సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నగర ప్రజలను అభినందిస్తున్నానని అన్నారు. ఒకప్పుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారినికి ప్రధాన కేంద్రంగా ఉండిన కొచ్చి ఇప్పుడు కేరళ వాణిజ్య రాజధానిగా ఉందని ప్రధాని అన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించిన అనంతరం ప్రధాని మెట్రో రైలులో కొంతదూరం ప్రయాణించారు కూడా. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, కేరళ గవర్నర్ పి సదాశివం, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితల, ఎర్నాకుళం ఎంపి కెవి థామస్, కొచ్చి మేయర్ సౌమిని జైన్ మెట్రోమ్యాన్ ఇ శ్రీ్ధరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్రో రైల్లో ప్రయాణించిన అనంతరం ప్రధాని ఒక ట్వీట్‌లో ఇది దేశాభివృద్ధికి దోహదపడే ఓ భావితరం వౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని అభివర్ణించారు.
కేరళలో అత్యంత ప్రతిష్ఠాకరమైన కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన మెట్రో రైలు ప్రాజెక్టుగా చెప్పవచ్చు. 2012 సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2013 జూన్‌లో పనులు ప్రారంభమైనాయి. 25 కిలోమీటర్ల కొచ్చి మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,181.79 కోట్లు కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చును భరించనున్నాయి. తొలి దశలో అలువా-పలరిపట్టం మధ్య 13.2 కిలోమీటర్ల మార్గంలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డుమార్గంలో ఈ దూరం వెళ్లడానికి 45 నిమిషాల సమయం పడుతుండగా, మెట్రో ప్రారంభంతో అది 23 నిమిషాలకు తగ్గిపోతుంది. ఈ నెల 19 (సోమవారం)నుంచి రెగ్యులర్ మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. కాగా, కొచ్చి మెట్రో రైలు ‘మేక్ ఇన్ ఇండియా’ విజన్‌కు ఓ నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ రైలు కోచ్‌లను చెన్నై సమీపంలో ఆల్‌స్టామ్ యూనిట్‌లో నిర్మించగా, 70 శాతం పరికరాలు దేశీయంగా తయారైన వాటినే ఉపయోగించారు.

కొచ్చిలో శనివారం మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేరళ గవర్నర్ పి సదాశివం, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తదితరులు