జాతీయ వార్తలు

ఇక దూకుడు కుదరదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: దురుసుగా ప్రవర్తించే విమాన ప్రయాణికులను అదుపు చేసేందుకు ఉద్దేశించిన నోఫ్లై జాబితాకు సంబంధించిన నిబంధనలు వచ్చే నెల ప్రారంభానికల్లా సిద్ధం అవుతాయని ప్రభుత్వం ఆదివారం తెలిపింది. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో గొడవ సృష్టించినందుకు దేశీయ విమానయాన సంస్థలు ఆయనను నిషేధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. విమానయాన సంస్థలతో సహా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారినుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం సవరించిన పౌర విమానయాన రిక్వైర్‌మెంట్ (సిఎఆర్-కార్)ను ఖరారు చేయడం జరుగుతోంది. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను దేశీయ విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడానికి ఉద్దేశించిన జాతీయ నోఫ్లై జాబితాకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ముసాయిదా నిబంధనావళిని విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం నిషేధాన్ని కనీసం మూడు నెలలనుంచి నిరవధిక కాలానికి పొడిగించే అవకాశముంటుంది. నోఫ్లై లిస్ట్‌కు సంబంధించిన ‘కార్’ను జూలై నెల మొదటివారంలో నోటిఫై చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌదరి పిటిఐకి చెప్పారు. ఆలస్యంగా వచ్చారన్న కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గత వారం విశాఖ విమానాశ్రయంలో గొడవ సృష్టించిన విషయం తెలిసిందే. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, జెసి దివాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఒక లోక్‌సభ సభ్యుడు డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది గొడవ పడ్డం ఇటీవలి కాలంలో ఇది రెండో సంఘటన. ఇంతకు ముందు శివసేనకు చెందిన లోక్‌సభ సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియాకు చెందిన ఉద్యోగిని కొట్టడంతో దేశీయ విమానయాన సంస్థలు ఆయనను తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడం తెలిసిందే. చివరికి గైక్వాడ్ క్షమాపణ చెప్పడంతో ఆ గొడవ సద్దు మణిగింది.
కాగా నోఫ్లై లిస్ట్‌కు సంబంధించి విడుదలకు సంబంధించి విడుదల చేసిన ముసాయిదా ప్రకారం ఈ జాబితాలో సంబంధిత విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తు అనంతరం దురుసుప్రవర్తన కలిగిన వ్యక్తిగా గుర్తించిన ప్రయాణికుల పేర్లు ఉంటాయి. అలాగే జాతీయ భద్రతకు ముప్పుగా గుర్తించిన వారి పేర్లు కూడా ఈ జాబితాలో ఉంటాయి. ఇది జాతీయ జాబితా అయినప్పటికీ, అన్ని విమానయాన సంస్థలు గుర్తించిన దురుసుప్రవర్తన ప్రయాణికుల జాబితా దీనిలో ఉన్నప్పటికీ ఒక విమానయాన కమిటీ సిఫార్సు చేసిన నిషేధాన్ని అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు.
కాగా, ప్రభుత్వం మూడు కేటగిరీల దురుసుప్రవర్తనలను సిఫార్సు చేయడమే కాకుండా వాటికి విధించే నిషేధాల కాలపరిమితులను కూడా సూచించింది. వీటికి మూడు నెలలనుంచి నిరవధిక కాలపరిమితి దాకా నిషేధాలు ఉంటాయి.