జాతీయ వార్తలు

బతికున్నా ‘చంపేశారు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18:ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది నిర్వాకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఇందుకు సంబంధించిన దిగ్భ్రాంతికర ఉదంతాలకు కొదవే లేదు..తాజాగా అలాంటిదే మరో సంఘటన. ఇది జరిగింది ఎక్కడో కాదు..్ఢల్లీలోని ఘనత వహించిన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోనే..అప్పుడే పుట్టిన ఓ శిశువు మరణించిందని ఈ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తేల్చేశారు..దుఃఖ సాగరంలో మునిగిన ఆ దంపతులు నవజాత శిశువు ఖననానికి సిద్ధం చేస్తున్న సమయంలోనే కళ్లు తెరిచింది. బాదర్‌పూర్‌కు చెందిన ఓ మహిళ ఆదివారం ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆ శిశువుకు ఊపిరి లేకపోవడంతో చనిపోయిందని నర్సులు, వైద్యులు ప్రకటించేశారు! అంతే కాదు..ఆ శిశువును ‘ప్యాక్’ చేసి చనిపోయిందనీ ముద్రించారని ఆ శిశువు తండ్రి రోహిత్ తెలిపారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోక పోవడంతో ఆసుపత్రిలోనే ఉంచేశారు. ఆ ‘మృత’శిశువును తీసుకుని రోహిత్ కన్నీటి పర్యంతంగా ఇంటి కొచ్చాడు. ఖననం చేసేందుకు ఏర్పాట్లూ మొదలు పెట్టాడు. ఆ క్షణంలో రోహిత్ సోదరికి ఆ ‘ప్యాక్’కదులుతున్నట్టు కనిపించింది. వెంటనే దాన్ని తెరిచి చూస్తే ఆ శిశువు కాళ్లూ చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే ఆ శిశువును మొదట అపోలో ఆసుపత్రికి, తర్వాత సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బతికున్న శిశువును చనిపోయిందని ప్రకటించిన వైద్యులపై కేసు పెట్టారు. ‘మేము ఆ సీల్ట్ ప్యాక్‌ను గమనించక పోయి ఉంటే ఓ చిన్నారిని సజీవంగానే ఖననం చేసి ఉండేవాళ్లమే..’నంటూ ఆ తండ్రి గుండెలు బాదుకున్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను శిక్షించాలని కోరాడు.