జాతీయ వార్తలు

తగ్గని ‘ప్రత్యేక’ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూన్ 18: డార్జిలింగ్‌లో జరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆదివారం మరింతగా తీవ్రమైంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎమ్)కు చెందిన ఓ కార్యకర్త మృతదేహాన్ని తీసుకుని వేలాదిమంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనంటూ పెద్దఎత్తున డిమాండ్ చేశారు. పోలీసు కాల్పుల్లో తమ కార్యకర్త మరణించడంతో మరింతగా రెచ్చిపోయిన ఆందోళనకారులు గత రెండు రోజులుగా పోలీసులతో తీవ్రస్థాయి ఘర్షణలకు దిగుతున్న నేపథ్యంలో ఆదివారం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
నల్లజెండాలను తమ కార్యకర్త మృతదేహాన్ని తీసుకుని సెంట్రల్ చౌక్‌బజార్‌కు చేరుకున్న జిజెఎమ్ కార్యకర్తలు తక్షణమే పోలీసులను డార్జిలింగ్ నుంచి తొలగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. చర్చలకు సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే ముందుగా ఇక్కడినుంచి పోలీసులు తొలగిపోవాలని డిమాండ్ చేశారు. అలాగే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమాన్ని నిర్వహించడానికి తమను అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సింగామారిలో తమకు చెందిన ఇద్దరు కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారని జిజెఎమ్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను నిరాకరించిన పోలీసులు ఘర్షణల్లోనే ఒక వ్యక్తి మరణించాడని వివరించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత తీవ్రస్థాయిలో ఈ డిమాండ్ తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ ఉద్యమాన్ని ఖండించిన ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ దీనివెనుక కుట్ర ఉందని కూడా ఆరోపించారు.3 ఈశాన్య ప్రాంతానికి చెందిన తిరుగుబాటు గ్రూపులో ఇక్కడ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాయని, దీనివెనుక విదేశీ హస్తం కూడా ఉందని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ ఆరోపణలను తిరస్కరించిన జిజెఎమ్ నేతలు గూర్ఖాలు తమ ఉనికి కోసమే పోరాటం చేస్తున్నారు తప్ప దీనివెనుక ఎవరి హస్తమూ లేదని స్పష్టం చేశారు. శనివారంనాటి పరిణామాల నేపథ్యంలో ఆదివారం పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేశారు. డార్జిలింగ్ వీధుల్లో సైనిక దళాలు గస్తీ తిరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మహిళా పోలీసులను కూడా నియోగించారు.

చిత్రాలు.. గూర్ఖా లాండ్ ప్రత్యేక రాష్ట్రంకోసం ఆదివారం ఇటు డార్జిలింగ్‌లోను అటు దేశరాజధాని ఢిల్లీలోను ఆందోళనలు తీవ్రమయ్యాయ జాతీయ జెండా పట్టుకొని డార్జిలింగ్‌లో జిజెఎం ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. అలాగే ఢిల్లీలో కూడా ప్రత్యక రాష్ట్ర డిమాండ్‌తో తీవ్రస్థాయ ఆందోళన జరిగింది.