జాతీయ వార్తలు

హింస తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అందుకు వీలుగా సామరస్యపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎమ్) ఆందోళనకారులకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వీలైన పరిస్థితులను పాదుగొల్పాలంటూ తాజాగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గత నాలుగు రోజులుగా తీవ్రస్థాయిలోకొనసాగుతోంది. హింసాకాండవల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని, శాంతియుత వాతావరణంలోనే ఇందుకు పరిష్కారం చిక్కుతుందని రాజ్‌నాథ్ తెలిపారు. తమ మధ్య ఉన్న విభేదాలు, అపోహలను తొలగించుకునేందుకు ఇరువర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఏ సమస్య పరిష్కారానికీ హింసా ప్రవృత్తి దోహదం చేయదని, అన్నింటికీ చర్చలే మార్గమని తెలిపారు. డార్జిలింగ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఆందోళనలను విడనాడి శాంతిబాట పట్టాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా మాట్లాడిన రాజ్‌నాథ్ శాంతిభద్రతల తాజా పరిస్థితిపై ఆమెతో చర్చించారు. డార్జిలింగ్‌లో నెలకొన్న పరిస్థితులను మమత తనకు వివరించారని రాజ్‌నాథ్ తెలిపారు.