జాతీయ వార్తలు

న్యాయపరమైన చిక్కుల వల్లే జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లను పెంచటం న్యాయపరమైన చిక్కుల మూలంగా ప్రస్తుతానికి ఆగిందని సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లను పెంచే అంశం విభజన చట్టంలో ఉన్నది, సీట్ల సంఖ్య పెంచే అంశంపై తాను, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు చేశాము, అయితే ఈ దశలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ చిక్కులన్నింటిని విడదీసి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే ప్రయత్నం జరుగుతోందని ఆయన వివరించారు. అలాగే ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీసు రూల్స్ గురించి మాట్లాడుతూ ఈ పక్రియను త్వరగా పూర్తిచేసి రెండు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకురుస్తామని అన్నారు. సోమవారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాల (ఏపీయూఎస్, టీపీయూస్) నాయకులు కలిసి వెంకయ్య నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.