జాతీయ వార్తలు

గవర్నర్ పదవికి రామ్‌నాథ్ రాజీనామా రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపికైన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు రాష్టప్రతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి బిహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎన్‌డిఏ తరఫున రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును సోమవారం బిజెపి ప్రకటించింది. 71 ఏళ్ల కోవింద్ రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మంగళవారం కేంద్రం రామ్‌నాథ్‌కు ఎన్‌ఎస్‌జి భద్రతను ఏర్పాటుచేసింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగియనుంది.