జాతీయ వార్తలు

జస్టిస్ కర్ణన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు, జూన్ 20: వివాదాస్పద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్‌ను పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు మంగళవారం కోయంబత్తూరులో అరెస్టు చేశారు. కర్ణన్ అర్టెయిన విషయాన్ని ఆయన వ్యక్తిగత న్యాయవాది పీటర్ రమేశ్ ధ్రువీకరించారు. కర్ణన్‌ను కోయంబత్తూరునుంచి చెన్నైకి తీసుకు వెళ్తున్నారు. అక్కడినుంచి బుధవారం ఉదయం కోల్‌కతాకు తీసుకెళ్తారు. కాగా, కర్ణన్ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటుగా దేశవ్యాప్తంగా పలువురు జడ్జీలపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా కర్ణన్ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసినందుకు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఎన్ని సార్లు ఆదేశించినా కర్ణన్ పట్టించుకోలేదు సరికదా సుప్రీంకోర్టు జడ్జీలకే సమన్లు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ నేరం కింద సర్వోన్నత న్యాయస్థానం గత నెల 9న కర్ణన్‌కు ఆరునెలలు జైలు శిక్ష విధించడమే కాకుండా ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను అదేశించడం తెలిసిందే. అయితే అప్పటినుంచి కర్ణన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలో ఉండగానే ఈ నెల 12న కర్ణన్ పదవీ విరమణ కూడా చేశారు. అజ్ఞాతంలోనే పదవీ విరమణ చేసిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాదు పదవీ విరమణ రోజున ఆయనకు కోల్‌కతా హైకోర్టు న్యాయవాదులు కనీసం వీడ్కోలు కూడా చెప్పలేదు. అలాగే హైకోర్టు అధికారులు చెప్పే వీడ్కోలు కార్యక్రమం కూడా జరగలేదు.

చిత్రం.. జస్టిస్ సిఎస్ కర్ణన్‌