జాతీయ వార్తలు

గతంలోనే రాష్టప్రతిగా దళితుడిని చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: దళితుడిని రాష్టప్రతిగా ఎంపిక చేయటం కొత్తేమీ కాదు, ఆ పని తామెప్పుడో చేశామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. ఆజాద్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటినుండీ దళితులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది, అత్యున్నత రాష్టప్రతి పదవికి దళితుడిని కాంగ్రెస్ ఎప్పుడో ఎంపిక చేసింది, కె.ఆర్.నారాయణన్‌ను రాష్టప్రతి చేయలేదా? అని ఆజాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ దళితులకు కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన పదవులు ఇచ్చింని ఆయన చెప్పారు. దళితుడిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం ఇది మొదటిసారి కాదుకదా? అని ఆయన అన్నారు. బిజెపి మొదట ప్రతిపక్ష పార్టీలకు తమ అభ్యర్థి గురించి తెలియజేసి ఆ తరువాత ప్రకటిస్తే బాగుండేదన్నారు. తమకు పేరు చెప్పకుండా మద్దతు ఇవ్వాలని కోరటం, ఆ తరువాత అకస్మాత్తుగా దళితుడి పేరును ప్రతిపాదించిందన్నారు. తటస్థంగా ఉండే వ్యక్తిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేస్తారని ఆశించాము కానీ బిజెపి ఆందుకు భిన్నంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాంను రాష్టప్రతి పదవికి ఎంపిక చేసినప్పుడు తామంతా సమర్థించాము, తటస్థంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసినందుకే అప్పుడు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడు బిజెపి తటస్థంగా లేని వ్యక్తిని ఎంపిక చేసింది కాబట్టి మద్దతు ఇవ్వటం సాధ్యం కాదని ఆజాద్ ప్రకటించారు. రాష్టప్రతి పదవికి ఇప్పుడు బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి ఎలాంటివాడు, అతని వ్యక్తిత్వం ఏమిటి అనేది తాము చర్చించటం లేదు, అయితే ఎంతైనా ఆయన బిజెపి నాయకుడు కదా అని ఆజాద్ అన్నారు. రాష్టప్రతి పదవికి పోటీ చేయాలా, వద్దా? చేస్తే అభ్యర్థి ఎవరు అనేదానిపై 22న ప్రతిపక్షానికి చెందిన అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తామని, ఆ తర్వాతే రాష్టప్రతి పదవికి తమ అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఆజాద్ తెలిపారు.