జాతీయ వార్తలు

ప్రణబ్‌కన్నా ఎక్కువ మెజారిటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్‌కు ఎలక్టోరల్ కాలేజి సంఖ్యాబలం పూర్తి అనుకూలంగా ఉండడమే కాకుండా ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఆయనకన్నా ముందు రాష్టప్రతిగా ఉండిన ప్రతిభా పాటిల్‌కన్నా కూడా ఎక్కువ ఓట్లు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన కోవింద్‌కు మద్దతు తెలపడంతో పాటుగా ఒడిశా అధికార పార్టీ అయిన బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లాంటి ప్రాంతీయ పార్టీలు సైతం ఆయనకు ఇప్పటికే మద్దతు ప్రకటించినందున ఒక వేళ రాష్టప్రతి పదవికి ఎన్నికలు జరిగినప్పటికీ దళిత నాయకుడయిన కోవింద్ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, తమిళనాడులో ప్రధాన పార్టీలయిన అన్నాడిఎంకె, డిఎంకెలలో ఏదో ఒక పార్టీ మద్దతును కూడా బిజెపి కోరే అవకాశముంది. రాష్టప్రతి ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఈ నెల 22న సమావేశమవుతున్న విషయం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు తప్పకుండా అభ్యర్థిని నిలబెడతాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో పిటిఐకి చెప్పారు.రాష్టప్రతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజిలో మొత్తం లోక్‌సభ సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలయిన ఢిల్లీ, పుదుచ్చేరి చట్టసభల సభ్యులు ఉంటారు. మొత్తం ఓట్ల సంఖ్య 10,98, 903 కాగా, ప్రతి ఎంపి ఓటు విలువ 708 ఓట్లు. కాగా, ఎమ్మెల్యే ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా ఉంటే గోవా,పుదుచ్చేరి లాంటి చిన్న రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ తక్కువగా ఉంటుంది. విజయానికి ఒక అభ్యర్థికి 50 శాతంకన్నా ఎక్కువ ఓట్లు అంటే 5,49,452కు పైగా ఓట్లు రావాలి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు మొత్తం 5,37,683 ఓట్లు ఉండగా ఇందులో శివసేన ఓట్లు కూడా ఉన్నాయి. అంటే ఎన్డీఏ అభ్యర్థి విజయానికి కేవలం 12 వేలు మాత్రమే తక్కువ. అయితే బిజెడి, వైకాపా, టిఆర్‌ఎస్‌లు ఇప్పటికే మద్దతుకు హామీ ఇవ్వడంతో పాటుగా అన్నాడిఎంకె కూడా మద్దతు ఇచ్చే అవకాశాలుండడంతో ఎన్డీఏ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలున్నాయి. ఓటింగ్ రహస్య మ్యాలెట్ ద్వారా జరుగుతుండడం, పార్టీ విప్ వర్తించకపోవడం లాంటి కారణాలతో చాలామంది ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేసే అవకాశముంది. 2012లో జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి 7,13,763 ఓట్లు రాగా 2007లో జరిగిన ఎన్నికల్లో ప్రతిభా పాటిల్‌కు 6,38,116 ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరూ అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నామినీలే.

చిత్రం.. మంగళవారం ఢిల్లీలోని బీహార్‌భవన్‌కు వస్తున్న ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్