జాతీయ వార్తలు

పోలీసుల సహనాన్ని పరీక్షించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 23: శ్రీనగర్‌లోని జామి యా మసీదు వద్ద డిఎస్పీని అల్లరి మూక కొట్టి చంపిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటయిన సంఘటన మరోటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. పోలీసుల సహనాన్ని పరీక్షించవద్దని కూడా ఆమె హెచ్చరించారు. జమ్మూ, కాశ్మీర్ పోలీసులు దేశంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్నారని, సొంతవారన్న స్పృహతోనే ఆందోళనకారుల పట్ల వారు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని ఆమె విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. పోలీసులు సహనం కోల్పోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అంతకు ముందు ఆమె పోలీసు లైన్స్‌లో చనిపోయిన డిఎస్పీ మృత దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
అమానుషం: రాహుల్
కాగా, జనం ఒక డిఎస్పీని కొట్టి చంపడాన్ని అమానుషమైనదిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారిపోయాయో ఈ సంఘటన చాటి చెప్తోందన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన కారణంగా రాష్ట్రం అనేక దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని ప్రస్తుతం ఇటలీలో ఉన్న రాహుల్ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

చిత్రం.. డిఎస్పీ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న సిఎం మహబూబా ముఫ్తీ