జాతీయ వార్తలు

ఆస్తి పన్ను బకాయి - ఆర్‌పిఎఫ్ ఆఫీసుకు తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 7: దేశ చరిత్రలోనే తొలిసారిగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ ఆప్తిపన్ను బటకాయి పడ్డ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ స్టేషన్‌కు శనివారం తాళాలు వేశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన విజ్ఞప్తులు సూచనలను పురష్కరించుకుని తిరిగి ఆ తాళాలను తొలగించారు. కృష్ణా పుష్కరాల పనుల్లో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు పాతబస్తీ కెఎల్ రావునగర్‌లో ఒక కిలో మీటర్ మేర అవుట్ ఫాల్ డ్రెయిన్ నిర్మాణాలను చేపట్టి జెసిబి యంత్రంతో మట్టితీత పనులను చురుగ్గా చేపట్టారు. కొద్ది రోజులుగా అవాంతరాలు సృష్టిస్తూ వచ్చిన రైల్వే అధికారులు శనివారం ఒక పథకం ప్రకారం అప్పటి వరకు కబేళా సెంటర్ నుంచి పాలఫ్యాక్టరీ వెనుకగల రైల్వే రహదారి నుంచి మళ్లించమడుతున్న వాహనాలను నిలిపివేయడమే గాక డ్రెయిన్ పనులకు కూడా అడ్డుపడ్డారు. ఇది తెలిసిన కమిషనర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని పనులను వేగవంతం చేయమని ఆదేశించి వెళ్లారు. దాంతో రైల్వే అధికారులు, సిబ్బంది పని చేసే వారిపై దూసుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఎవరి పంథాలో వారు తోపులాటకు దిగారు. పరిస్థితి అదుపుదాటుతుండటాన్ని గుర్తించిన కమిషనర్ రైల్వే ఆస్తి పన్ను బకాయిల పైళ్లను వెలికిదీసి రూ. 1.50 లక్షలు బకాయిలను దృష్టిలో ఉంచుకుని అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, బిల్ కలెక్టర్‌లు, పలువురు మహిళా అధికారులు నేరుగా ఆర్‌పిఎఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఎఎస్‌ఐ రషీద్‌తోపాటు మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. అరెస్ట్ చేస్తానంటూ బెదిరించడంతో మున్సిపల్ అధికారులు ఏకంగా ఎస్‌ఐ రూమ్‌కే తాళాలు వేసి సీజ్ చేశారు.