జాతీయ వార్తలు

పాక్ బలగాల రాక్షస క్రీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూన్ 24: నియంత్రణ రేఖను దాటి వచ్చి జమ్మూ-కాశ్మీరులోని పూంచ్ జిల్లాలో భారత సైనిక గస్తీ బృందంపై దాడికి పాల్పడిన పాకిస్తానీ బోర్డర్ యాక్షన్ టీమ్ (బిఎటి)ను ప్రత్యేక బలగాలకు చెందిన సిబ్బందితో పాటు తీవ్రవాదులతో ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన డాగర్లు, ఇతర ఆయుధాలను చేతబట్టుకుని భారత భూభాగంలోకి ప్రవేశించిన వీరంతా భారత సైనిక సిబ్బందిపై దాడిని చిత్రీకరించేందుకు హెడ్‌బ్యాండ్ (తలకు అమర్చుకునే) కెమెరాలను ధరించి వచ్చారని సైనికదళ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన జరిగిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, భారత సైనికులు జరిపిన ఎదురు కాల్పుల్లో బిఎటి సభ్యుడు ఒకడు హతమైన విషయం తెలిసిందే. ఈ చొరబాటుదారుడి మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు శుక్రవారం ఆ అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. హతుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పరికరాలు, మందుగుండు సామగ్రిలో ఒక ఎకె రైఫిల్, మూడు మ్యాగజీన్లు (తూటాలు), రెండు గ్రెనేడ్లు, డ్రస్సులు, బ్యాగ్‌లతో పాటు శిరచ్ఛేదానికి, మృతదేహాలను ఛిద్రం చేసేందుకు ఉపయోగించే ప్రత్యేకమైన డాగర్, కత్తి ఉన్నాయని, పాకిస్తాన్ సైనిక బలగాల రాక్షస ధోరణికి ఇవి అద్దం పడుతున్నాయని ఆ అధికారి వివరించారు. హతుడు ధరించిన హెడ్‌బ్యాండ్ కెమేరా సరిహద్దు ఆవలి వైపున పాక్ సైనిక కేంద్రాలతో ప్రత్యక్షంగా అనుసంధానమై ఉందా లేదా అనేది దర్యాప్తులో తేలాల్సిన విషయమని ఆయన చెప్పారు.