జాతీయ వార్తలు

మళ్లీ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూన్ 5: పాకిస్తాన్ సైన్యం ఆదివారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో అధీన రేఖ వెంబడి ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులకు తెగబడింది. నౌషేరా సెక్టార్‌లో అధీన రేఖ పొడవునా ఉన్న భారత సైన్యం పోస్టులపై పాక్ సైన్యం ఆదివారం ఉదయం ఆరున్నర గంటలనుంచి ఎలాంటి కవ్వింపూ లేకుండానే తేలిక పాటి ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత సైన్యం ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. గత 24 గంటల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడ్డం ఇది రెండో సంఘటన. శనివారం కూడా పాక్ సైన్యం పూంఛ్ సెక్టార్‌లో అధీన రేఖ వెంబడి భారత ఆర్మీ పోస్టులపై ఉదయం 11.30 గంటలనుంచి 14.10 గంటలక వరకు తేలికపాటి ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులు జరిపింది.