జాతీయ వార్తలు

పార్టీ పటిష్టతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్ఛేరి, జూన్ 26: దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడకు చేరుకున్నారు. దేశంలో బిజెపిని పటిష్టం చేయడానికి జాతీయస్థాయిలో 110 రోజుల పర్యటన రూపొందించుకున్నారు. అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో రెండోసారి పర్యటనకు వచ్చారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, బిజెపి జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఏర్పాట్లు పర్యవేక్షించారు. తొలుత షా రాజ్ నివాస్‌లోని ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశానికి తరలివెళ్లారు. ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీ కార్యకర్తలు సమాశానికి మీడియాను అనుమతించలేదు. ఇలాఉండగా ప్రతిపక్ష ఎఐఎన్‌ఆర్‌సి నేత, మాజీ సిఎం ఎన్ రంగసామి ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోమవారం పుదుచ్ఛేరి పర్యటనకు వచ్చిన అమిత్ షాను రంగసామి తన శాసన సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లి కలిశారు. రెండు రోజుల పర్యటనలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో అమిత్‌షా భేటీ కానున్నారు.

చిత్రం.. పుదుచ్ఛేరిలో సోమవారం ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి
విగ్రహానికి పూలమాల వేస్తున్న అమిత్ షా