జాతీయ వార్తలు

ఆషామాషీ పోటీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: రాష్టప్రతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆషామాషీగా ఏమీ పోటీ చేయడం లేదని, ఈ ఎన్నికల్లో ఆమె గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మీరా కుమార్‌కు మద్దతు తెలపాల్సిందిగా ఎన్‌డిఎ మిత్రపక్షాలను ఒప్పించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తాయని ఆయన తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 10,98,903 మంది ఓటర్లగాను దాదాపు 4 లక్షల మంది ఓటర్లతో తాము ఇప్పటికే మాట్లాడామని, రాష్టప్రతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ రాజకీయ పార్టీలు విప్ జారీ చేసేందుకు వీలులేనందున ఏమి జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు. ‘ఎన్‌డిఎ మిత్రపక్షాల్లోని కొన్ని పార్టీలు మాకు అనుకూలంగా ఓటు వేయవచ్చు. కనుక రాష్టప్రతి ఎన్నికల్లో పోటీ గట్టిగా ఉంటుంది. మీరా కుమార్‌కు మద్దతు తెలపాల్సిందిగా ఎన్‌డిఎ మిత్రపక్షాలను ఒప్పించేందుకు విపక్షాలు తప్పకుండా ప్రయత్నిస్తాయి’ అని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయించుకోవడం విచారకరమని ఆయన అన్నారు. ‘రాష్ట్ర (బిహార్) రాజకీయాల్లో ఇటువంటి సమస్య తలెత్తి ఉండవచ్చు. ఆకస్మికంగా జరిగిన ఈ మార్పునకు కారణమేమిటో మాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు విచారకరమైనదే’ అని సుధాకర్‌రెడ్డి తెలిపారు.