జాతీయ వార్తలు

ఒక్కటిగా ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 29: భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అంటూ, కులాలు, మతాల ప్రాతిపదికన కాకుండా దేశమంతా ఒక్కటిగా ముందుకు సాగాలని అన్నారు. ఇటీవల దేశంలో కొంతమంది మైనారిటీలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇక్కడొక కార్యక్రమంలో రాష్టప్రతి మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వానికి ప్రతీక అని, ఏడు మతాలకు చెందిన 130 కోట్ల మంది ఉన్నారని, 200 భాషలు, 1800 మాండలికాలు ఉన్నాయని అన్నారు. మూడు ప్రధాన మతాలకు చెందిన వారు ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే పరిపాలనా ప్రక్రియ కింద జీవిస్తున్నారన్నారు. ‘్భరతీయ సంస్కృతి ఇది. మనం మారాల్సిందే. ముందుకు కూడా వెళ్లాల్సిందే.
అయితే ఎవరికి వారుగా, కులాలు, మతాలవారీగా కాకుండా మొత్తం దేశ జనాభా అంతా కలిసి ఒక్కటిగా ముందుకు వెళ్లాలి’ అని రాష్టప్రతి అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక ప్రధాన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఏఐ) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి దేశంలోని యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలను కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ, అలా చేసినప్పుడు వారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక శక్తిగా అవతరిస్తారని అన్నారు.

చిత్రం.. కోల్‌కతాలో గురువారం ఐసిఏఐ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్. చిత్రంలో కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ తదితరులు