జాతీయ వార్తలు

రాష్టప్రతి పదవికి 104 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: రాష్టప్రతి పదవికోసం జరుగుతున్న ఎన్నికల్లో 102 మంది దాఖలు చేసిన నామినేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. 104 మంది రాష్టప్రతి పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఏన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్‌ల నామినేషన్ పత్రాలు మాత్రమే సరిగా ఉన్నందున వారిరువురు మాత్రమే పోటీలో ఉంటారు. మొత్తం 102 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం సరైన ఆధారాలు, రుజువు పత్రాలు సమర్పించని కారణంతోపాటు ప్రజాప్రతినిధులు బలపరచకపోవడంతో తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాలనుంచి కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. తిరస్కరించిన వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య వేణుగోపాల్ కుమార్, తెలంగాణ హైదరాబాద్ నుంచి విరవాల్ల సోమదేవరాజులు దాఖలు చేసిన నామినేషన్లు కూడా ఉన్నాయి.