జాతీయ వార్తలు

దేనిపై ఎంత పన్ను వేస్తారంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: శుక్రవారం అర్ధరాత్రి నుంచి చారిత్రక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రాబోతుండటం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొత్తం నాలుగు శ్లాబుల పరిధిలోకి ఏయే వస్తువులు వస్తాయన్న దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు పన్ను లేని వస్తువులు, సేవలు ఏమిటి? అలాగే 5, 12, 18, 28 శాతం పన్నుల శ్లాబుల్లోకి వచ్చే వస్తువులు, సేవలు ఏమిటన్న విషయం ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తం 1,211 వస్తువులను వాటి వినియోగ స్థాయిని బట్టి ఈ నాలుగు పన్ను శ్లాబుల పరిధిలోకి తీసుకొచ్చారు. వాటి వివరాలు ఇలా వున్నాయ:
అసలు పన్ను లేనివి
వస్తువులు: జౌళి, తాజా మాంసం, చేపలు, చికెన్, కోడిగుడ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, సహజసిద్ధంగా తీసిన తేనె, తాజా పండ్లు, కూరగాయలు, స్టాంపు పేపర్లు, ఉప్పు, బొట్లు, ముద్రించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు మొదలైనవి. సేవలు: వెయ్యి రూపాయల లోపు టారిఫ్ కలిగిన హోటళ్లు, లాడ్జీలు, సానపెట్టని, పాక్షికంగా సానపెట్టిన రంగురాళ్లు, రత్నాలు.
5 శాతం పన్ను విధించేవి
వస్తువులు: ఫిష్ ఫిలెట్లు (చేప ముక్కలు), వెయ్యి రూపాయల లోపు ధర ఉన్న వస్త్రాలు, ప్యాకింగ్ చేసిన ఆహార పదార్ధాలు, రూ.500 లోపు ధర కలిగిన పాదరక్షలు, క్రీములు, పాలపొడి, నిల్వ ఉంచిన కాయగూరలు, కాఫీ, టీ, సుగంథ ద్రవ్యాలు, పిజ్జా బ్రెడ్, కిరోసిన్, మందులు, స్టెంట్లు, జీడిపప్పు, బయోగ్యాస్, ఇన్సులిన్, అగరువత్తులు, పోస్టేజీ, రెవెన్యూ స్టాంపులు మొదలైనవి. సేవలు: రవాణా సర్వీసులు (రైల్వేలు, విమాన రవాణా), చిన్న రెస్టారెంట్లు మొదలైనవి.
12 శాతం పన్ను విధించేవి
వస్తువులు: వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, నిల్వ ఉంచిన మాంస పదార్ధాలు, నెయ్యి, వెన్న, డ్రైఫ్రూట్స్, సాస్‌లు, ఫ్రూట్‌జ్యూస్‌లు, ఆయుర్వేద మందులు, పళ్లపొడి, అగరువత్తులు, బొమ్మల పుస్తకాలు, గొడుగులు, కుట్టుమిషన్లు, సెల్‌ఫోన్లు, ఎక్సర్‌సైజ్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, కళ్లజోళ్లు, చెస్‌బోర్డులు, క్యారమ్ బోర్డులు మొదలైనవి.
సేవలు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాటరీలు, నాన్ ఏసీ హోటళ్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, ఎరువులు మొదలైనవి. వర్కు కాంట్రాక్టులు కూడా 12 శాతం జిఎస్‌టి పరిధిలోకి వస్తాయి.
18 శాతం పన్ను విధించేవి
వస్తువులు: పాద రక్షలు సహా రూ.500 కంటే ఎక్కువ ధర కలిగిన చాలా వస్తువులు దీని పరిధిలోకి వస్తాయి. బీడీ పట్టా, బిస్కెట్లు (అన్ని కేటగిరీలు), పేస్ట్రీలు, కేకులు, జాములు, ఐస్‌క్రీమ్‌లు, ఇన్‌స్టెంట్ ఆహారపదార్ధాలు, మినరల్ వాటర్, నోట్ పుస్తకాలు, కెమేరాలు, స్పీకర్లు, మానిటర్లు, కాజల్ పెన్సిళ్లు, హెడ్‌గేర్లు, వేయింగ్ మిషన్లు, ప్రింటర్లు, ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లు, సిసిటీవీలు, వెదురు ఫర్నీచర్, కర్రీపేస్టు తదితర వస్తువులు.
సేవలు: మద్యం విక్రయించే ఏసీ హోటళ్లు, టెలికామ్ సర్వీసులు, ఐటి సర్వీసులు, బ్రాండెడ్ దుస్తులు మొదలైనవి. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉండే రెస్టారెంట్లు, రూ.2,500 నుంచి రూ.7,500 మధ్య టారిఫ్ కలిగిన హోటల్ రూములు కూడా దీని పరిధిలోకి వస్తాయి.
28 శాతం పన్ను విధించేవి
వస్తువులు: బీడీలు, చూయింగ్‌గమ్‌లు, మొలాసిస్, చాక్లెట్లు, వేపర్లు, పాన్‌మసాలా, ఏరేటెడ్ వాటర్, పెయింట్లు, డియోడరెంట్లు, షేవింగ్ క్రీమ్‌లు, ఆఫ్టర్‌షేవ్ లోషన్లు, వాల్‌పేపర్లు, సిరామిక్ టైల్స్, వాటర్ హీటర్లు, వేయింగ్ మిషన్లు, వాషింగ్ మిషన్లు, ఎటిఎం, వెండింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, హెయిర్ క్లిప్పర్లు, ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, వ్యక్తిగతంగా వినియోగించే విమానాలు మొదలైన వాటిపై అత్యధిక స్థాయిలో జిఎస్‌టి అమలవుతుంది.
సేవలు: రాష్ట్రాల ఆమోదంతో నడిచే ప్రైవేటు లాటరీలు, రూ.7,500 కంటే ఎక్కువ చార్జీ కలిగిన హోటల్ రూములు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, రేస్‌క్లబ్ బెట్టింగులు, సినిమాలు మొదలైనవి.