జాతీయ వార్తలు

పిగ్గీ బ్యాంకు తీసుకుని న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 29: తల్లి ఆత్మహత్యతో తల్లిడిల్లిపోయిన ఓ చిన్నారి న్యాయం కోసం పోలీసులకు లంచం ఇవ్వడానికి సైతం సిద్ధపడింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో గుండెలను పిండే ఘటన చోటుచేసుకుంది. తల్లి సంక్షరణలో గడపాల్సిన ఐదేళ్ల బాలిక తాను పిగ్గీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇవ్వబోయింది. ఐదేళ్ల మాన్వీ తల్లి సీమా కౌశిక్ ఏప్రిల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన ఏడాదికే కట్న వేధింపులు ఎక్కువైపోయి పుట్టింటికి వచ్చి ఉంటోంది. నాలుగేళ్లుగా తల్లిదండ్రులతోనే ఉంటున్న సీమాపై అత్తింటివారు తప్పుడు కేసులు పెట్టారు. వీటన్నింటినీ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. భర్త సంజీవ్ కౌశిక్, అతడి కుటుంబ సభ్యులపై సీమా బంధువులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాతయ్య శాంతి స్వరూప్, మామయ్య రోహిత్ శర్మ మాన్వీని వెంటబెట్టుకుని పోలీసు ఇన్స్‌పెక్టర్ జనరల్ రామ్‌కుమార్‌ను కలిశారు. అమ్మను కోల్పోయిన బాధతో ఉన్న చిన్నారి దోషులను పట్టుకోవాలని పోలీసులను వేడుకుంది. సొమ్ములు ఇస్తేనే పోలీసు స్టేషన్లో న్యాయం జరుగుతుందని ఎవరో అన్న మాటలతో మాన్వీ తన దగ్గర పిగ్గీబ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడింది. ‘ఈ సొమ్ములు తీసుకుని నా తల్లిని ఆత్మహత్యకు కారకులైన దుర్మార్గులపై చర్య తీసుకోండి’ అంటూ చిన్నారి కన్నీళ్లుపెట్టుకుంది. ఐజి కుమార్ చిన్నారిని సముదాయించి నిందితులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.