జాతీయ వార్తలు

మైనార్టీల భద్రతకు ఢోకాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో మైనార్టీలకు ఎలాంటి అభద్రతాభావం లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. మైనార్టీలను లక్ష్యం చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలపై స్పందించారు. దేశంలో మైనార్టీలు అభద్రతకు గురికావలసిన వాతావరణం లేదని, అక్కడక్కడా జరుగుతున్న ఘటనల వెనుక దుష్టశక్తులు ఉన్నాయని ఆరోపించారు. వీటి ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ శక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం వివిధ సమాజాల మధ్య విశ్వాసం పాదుకొల్పేందుకు, వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ‘‘మైనార్టీలలో భయం కానీ, అభద్రత కానీ ఉందని నేను భావించటం లేదు. కానీ, ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో అవి పెద్దవైనా, చిన్నవైనా వాటి వెనుక నేరపూరిత కుట్ర దాగి ఉంది. ఇలాంటి ఘటనలను ఏ విధంగానూ సమర్థించలేం చట్టం ప్రకారం దోషులెవరైనా వారిపై చర్యలు తీసుకొని తీరుతాం.’’ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర వక్ఫ్ మండలి 76వ సమావేశంలో గురువారం నఖ్వీ మాట్లాడారు. రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్‌లలో ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. తాను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడానని అధికారులతో కూడా చర్చించానని వివరించారు. ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, సిఖ్కుల సామాజిక, ఆర్థిక విద్యా, ఉపాధి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నఖ్వీ స్పష్టం చేశారు.