జాతీయ వార్తలు

జిఎస్‌టి సమావేశాన్ని బహిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసిన జిఎస్‌టి ప్రారంభోత్సవ సమావేశం వివాదాస్పదంగా తయారైంది. జిఎస్‌టి ప్రారంభోత్సవ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పన్నుల విధానంలో మొదటిసారి జిఎస్‌టి ద్వారా సమూల మార్పు జరుగుతోంది. అందువల్లే పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రతిపక్షం ఎలా బాయ్‌కాట్ చేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. జిఎస్‌టి ప్రారంభోత్సవ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించినట్లు రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి జయరాం రమేష్ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. జిఎస్‌టి సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని వామపక్షాలు, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ ఇంతకుముందే నిర్ణయించాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన సమావేశాలు మాత్రమే ఇంతవరకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగాయి. అంత ప్రాముఖ్యత ఉన్న సెంట్రల్ హాల్ నుండి జిఎస్‌టి అమలు చేసేందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం తమకు ఇష్టం లేదని కాంగ్రెస్ తెలిపింది. ప్రస్తుతం దేశం జిఎస్‌టికి సిద్ధంగా లేదు, ఇలాంటి పరిస్థితిలో జిఎస్‌టిని అమలు చేయటం ఎంతమాత్రం హర్షణీయం కాదని వారు స్పష్టం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఇంతవరకు కేవలం మూడుసార్లు మాత్రమే అర్ధరాత్రి సమావేశాలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మొదటిసారిగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సంబరాలను జరుపుకున్నారు. ఆ తరువాత స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ, గోల్డన్ జూబ్లీ సందర్భంగా మరో రెండుసార్లు అర్ధరాత్రి సమావేశాలు జరిగాయని ఆజాద్ వివరించారు. జిఎస్‌టి ప్రారంభోత్సవ సమావేశాన్ని కాంగ్రెస్ తదితర పార్టీలు బాయ్‌కాట్ చేయటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాలు 15ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చోపచర్చలు జరిపాయి. ఒక ఉన్నతాధికారుల కమిటీ కూడా అందరితో చర్చించి జిఎస్‌టిని రూపొందించారు. అలాంటి ఒక చరిత్రాత్మక ఘట్టాన్ని తిరస్కరించటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. సమావేశాన్ని బాయ్‌కాట్ చేయటం ద్వారా ఏకాభిప్రాయ సాధనకు జరిగిన 15ఏళ్ల ప్రక్రియను వీరు అవమానిస్తున్నారని జైట్లీ దుయ్యబట్టారు. పార్లమెంటు ఉభయసభల్లో అన్ని పార్టీల మద్దతుతోనే జిఎస్‌టి బిల్లును ఆమోదించటం జరిగింది. జిఎస్‌టిని కేంద్ర ప్రభుత్వం ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదు. 31 రాష్ట్రాలు కూడా దీనిని ఆమోదించాయి. ఇలాంటి కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడంద్వారా 31 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని జైట్లీ అన్నారు.
దేశంలో మొదటిసారి ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుంటే, దీనిని బాయ్‌కాట్ చేయటం విడ్డూరంగా ఉన్నదని సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. జిఎస్‌టి ఒక్కరి నిర్ణయం కాదు, పార్లమెంటు ఉభయసభల్లో అన్ని పార్టీలు అంగీకరించాయి, 31 రాష్ట్రాలు ఆమోదించాయి, ఇలాంటి అత్యంత ముఖ్యమైన జిఎస్‌టి అమలు కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎలా బాయికాట్ చేస్తుందని ఆయన నిలదీశారు.

చిత్రం.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ఆజాద్