జాతీయ వార్తలు

దూసుకెళ్లిన జీశాట్-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 29: సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇస్రో గురువారం తెల్లవారు జామున 2గంటల 45నిమిషాలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జీశాట్-17 ఉపగ్రహ ప్రయోగాన్ని దిగ్విజయంగా ప్రయోగించింది. 3,447 కిలోల బరువుగల జీశాట్-17 కమ్యూనికేషన్ ఉపగ్రహంతో పాటు యూరఫ్ దేశానికి చెందిన హెల్లాస్ శాట్-3 మరో ఉపగ్రహాన్ని ఏరియన్-5 ఈసిఎ, విఎ 238 వాహక నౌక ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ భూమి నుండి నింగిలోకి పయనమైన అనంతరం తన అన్ని దశలను సునాయసనంగా పూర్తి చేసుకొని 39నిమిషాల్లో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. అక్కడి నుండి బెంగళూరులోని హసన్ ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు తమ ఆధీనంలోకి తీసుకొని ఉపగ్రహంలో నింపిన 1997కిలోల ద్రవ ఇంధనాన్ని మండించి మూడు,నాలుగు దశల్లో భూ మధ్య రేఖకు 93.5డిగ్రీల ఏటవాలులో భూమికి 36కి.మీ ఎత్తులో భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ఇస్రో శాస్తవ్రేత్తలు విజయవంతంగా చేర్చారు. ట్రాన్స్‌పాండర్ల సంఖ్యను పెంచుకోవడానికి సమాచార ఉపగ్రహాలు భారత దేశానికి సుమారు 550ట్రాన్స్‌పాండర్లు అవసరం ఉండగా 250ట్రాన్స్‌పాండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటీవల సమాచార ఉపగ్రహాలను అత్యధికంగా పంపించేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. జిఎస్‌ఎల్‌వి వాహక నౌకల ద్వారా షార్ కేంద్రం నుంచి ఇస్రో మూడు సమాచార ఉపగ్రహాలను పంపింది.
అయితే నేడు సమాచారం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానికి దేశ ప్రజలకు అందించేందుకు సమాచార ఉపగ్రహాలను ఎక్కువగా ప్రయోగించడంతో భాగంగా జీశాట్ -17 ఉపగ్రహంలో 42ట్రాన్స్‌ఫాండర్లను అమర్చి పంపించారు. ఇందులో 24సీ-బాండ్ ట్రాన్స్‌ఫాండర్లు, 2లోయర్ సీ-బాండ్, 12 అప్పర్ సీ-బాండ్, 2 సీ-ఎక్స్, 2 ఎస్‌ఎక్స్ ట్రాన్స్‌ఫాండర్లను అమర్చి పంపారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. మనకు సమాచార ఉపగ్రహాలను పంపించేందుకు అంత సామర్థ్యం లేకపోవడంతో ఫ్రెంచిగయానా నుంచి ఈ ప్రయోగం చేపట్టారు.
కమ్యూనికేషన్ వ్యవస్థలో మరో ముందడుగు..
భారత కమ్యూనికేషన్ ఉపగ్రహాల జాబితాలో మరో శాటిలైట్ చేరింది. ఇప్పటి వరకు ఇస్రో 17సమాచార వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించి ఉన్నారు. గురువారం ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించిన జీశాట్-17 18వ ఉపగ్రహం కావడం విశేషం. ఇది భారత సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. ఫ్రెంచి గయాన నుంచి ప్రయోగించిన శాటిలైట్స్‌లో ఇది మూడో సమాచార ఉపగ్రహం. జీశాట్-17 టెలికమ్యూనికేషన్ రంగంలో సి-బ్యాండ్ జీశాట్ ఫిక్స్‌డ్ శాటిలైట్ సేవలను అందించనున్నది. ఎస్ బ్యాండ్ ద్వారా మోబైల్ శాటిలైట్, డేటా రిలే సేవలను, యూహెచ్‌ఎఫ్ బ్యాండ్ ద్వారా రెస్క్యూ సేవలను జీశాట్ అందించనుంది. ఇప్పటి వరకు ఫ్రెంచి గయానా నుంచి 21 ఉపగ్రహాలను భారత్ ప్రయోగించింది.