జాతీయ వార్తలు

దాడులను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 29: గోరక్షణ పేరుతో హత్యలకు పాల్లడితే ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హ్చెరించారు. గురువారం ఇక్కడ సబర్మతీ ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ‘సమాజంలో హింసకు తావులేదు’ అని స్పష్టం చేశారు. గో రక్షకులమంటూ కొందరు సామూహిక హత్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గోభక్తి(గోపూజ) పేరుతో అమాయకులు చంపడం గర్హనీయం. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా సహించబోం’అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన అహింసా సిద్ధాంతానికి ఇవి విరుద్ధమని ప్రధాని స్పష్టం చేశారు. అహింస భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని ఆయన ఉద్ఘాటించారు. అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదని ఆయన అన్నారు. గాంధీ మహాత్ముడు కన్న కలలను నిజం చేయడానికి అందరూ కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.‘ గాంథీ పుట్టిన దేశంలో ఉన్న మనం గోరక్షణ పేరుతో దాడులకు దిగడం సరైందేనా?’అని ఆయన ప్రశ్నించారు. గాంధీ, ఆచార్య వినోబాభావే కంటే ఎక్కువగా గోరరక్షణ గురించి మాట్లాడేవారుండని అలాంటిది వారి ఆశయాలకే భంగం కలిగేలా వ్యవహరించడం సరైందికాదని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా ప్రవర్తన ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ గురు శ్రీమద్ రాజ్‌చంద్‌రాజ్ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఓ స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.

చిత్రం.. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో రాట్నం వడుకుతున్న మోదీ