జాతీయ వార్తలు

ఎరువులపై 5 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: దేశవ్యాప్తంగా రైతాంగానికి చివరి క్షణంలో జిఎస్‌టి పన్ను భారం నుంచి ఊరట లభించింది. శుక్రవారం రాత్రి సమావేశమైన జిఎస్‌టి మండలి ఎరువులపై పన్నును 12శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. పనె్నండు శాతం పన్ను విధించడం వల్ల ఎరువుల రేట్లు పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జిఎస్‌టి చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అలాగే మరో కీలక నిర్ణయాన్ని కూడా జిఎస్‌టి మండలి తీసుకుందని, ఇందులో భాగంగా ట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక విడిభాగాలపై రేటును కూడా 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిందని చెప్పారు. ఎరువులపై పనె్నండు శాతం పన్ను విధించడం వల్ల రైతులపై భారం పడుతుందని నేటి జిఎస్‌టి సమావేశంలో ఆందోళన వ్యక్తమైనందునే ఈ పన్ను శాతాన్ని 5కు కుదించడం జరిగిందని జైట్లీ వివరించారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. మొదట కృతజ్ఞతలు తెలిపేందుకే జిఎస్‌టి సమావేశమైనప్పటికీ ఇందులోనే ఎరువులపై పన్ను అంశాన్ని చేపట్టడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటి వరకూ 18సార్లు జిఎస్‌టి సమావేశమైంది. ఈ చివరి సమావేశంలో ఇచ్చిన విందుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.