జాతీయ వార్తలు

జౌళిపై జిఎస్‌టి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: జౌళి, బీడీ పరిశ్రమ, సినిమా టికెట్లను జిఎస్‌టి నుంచి మినహాయించాలని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఆయనొక లేఖ రాశారు. జిఎస్‌టి వల్ల నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పేద ప్రజలకు ఏకైక వినోదం సినిమా అంటూ దానిపై జిఎస్‌టి విధించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకే కాదు సినిమా పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. అలాగే జౌళి పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని జైట్లీకి రాసిన లేఖలో చెప్పారు. అలాగే తెలంగాణలోని గద్వాలలో ఉన్న చీరల పరిశ్రమ దెబ్బతింటుందని ఎల్లయ్య చెప్పారు. లక్షలాది మంది ఉపాధిని కాపాడాలంటే జౌళిపై విధించిన జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.