జాతీయ వార్తలు

జిఎస్‌టి తొందరపాటు నిర్ణయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: పరోక్ష పన్నులన్నింటినీ కలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు శ్లాబుల్లో తీసుకొచ్చిన కొత్త వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) గందరగోళమయమంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. శుక్రవారం అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజకీయ పార్టీలతో పాటు వాణిజ్య వర్తక శ్రేణులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. జిఎస్‌టి పరిపూర్ణం కాదంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఈ చారిత్రక ఘట్టాన్ని బహిష్కరించవద్దంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చివరి అభ్యర్థనను కూడా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తిరస్కరించాయి. ఎంతో ప్రాధాన్యత కలిగిన జిఎస్‌టి వంటి సంస్కరణ విధానంపై పూర్తిస్థాయిలో చర్చలు జరపకుండా అసంపూర్తిగానే దీన్ని అమలుచేయడం ఎంతమాత్రం సహేతుకం కాదని రాహుల్ పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్‌డిఏ సర్కార్ తన ఘనతను చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. విదేశీ పర్యటననుంచి స్వదేశానికి తిరిగొస్తున్న రాహుల్ జిఎస్‌టిపై చేసిన ట్వీట్‌లో అనేక వ్యాఖ్యలు చేశారు. నిజానికి జిఎస్‌టిని మొదట తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కానీ ఎన్‌డిఏ సర్కారు మాత్రం పెద్దనోట్ల రద్దు చందంగానే జిఎస్‌టి విషయంలోనూ అసంబద్ధంగా తొందరపాటుతో వ్యవహరిస్తోందన్నారు. జిఎస్‌టి అమలుతో ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ మళ్లీ తెరపైకి వచ్చినట్లయిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఒకప్పుడు ఏ వ్యవస్థనైతే దేశ ప్రజలు తిరస్కరించారో దానే్న మోదీ సర్కార్ అమలుచేస్తోందంటూ ధ్వజమెత్తారు. జిఎస్‌టి నిబంధనలు చిన్న వర్తకులను వేధించడానికి దారితీస్తాయని, వ్యాపారాలు కూడా సక్రమంగా సాగేందుకు అవకాశం ఉండదన్నారు. ‘1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 2017 జూన్ 30 అర్ధరాత్రి దేశ స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికే తీవ్ర ముప్పు ఎదురైంది’ అని మమత అన్నారు.

చిత్రాలు.. జిఎస్‌టి అమలును నిరసిస్తూ సిమ్లాలో బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు... వారణాసిలో నినాదాలు చేస్తున్న వ్యాపారులు... కోల్‌కతాలో జైట్లీ దిష్టిబొమ్మను ఊరేగిస్తున్న దృశ్యం