జాతీయ వార్తలు

నేటినుంచి బ్యాంకు సేవలూ భారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: కొత్తగా వస్తుసేవా పన్ను (జిఎస్‌టి) అమలులోకి రావడంతో శనివారంనుంచి బ్యాంకు సర్వీసులు, ఎల్‌ఐసి ప్రీమియం, క్రెడిట్‌కార్డు బిల్లులు మరింత భారం కాబోతున్నాయి. ఈ కొత్త విధానం శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలుకావడంతో మారిన రేట్లు ఆ మరునాటినుంచే అమలులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని ఆర్థిక సర్వీసులపై పన్ను రేటు ప్రస్తుతం ఉన్న 15 శాతం కాకుండా 18 శాతమే ఉండబోతోందని, ఇప్పటికే పెరిగిన పన్ను రేట్లకు సంబంధించి తమ వినియోగదారులకు సందేశాలు పంపించేశాయి. ఇక మామూలు బ్యాంకింగ్ సర్వీసుల పరిధిలోకి వచ్చే డెబిట్ కార్డులు, నిధుల బదిలీ, ఎటిఎం విత్‌డ్రాయల్స్ కనీస పరిమితి దాటితే 18 శాతం పన్ను అమలవుతుంది. అలాగే హోమ్‌లోన్ ప్రాసెసింగ్ ఫీజు, లాకర్ రెంటల్స్, చెక్కుబుక్‌లు, డూప్లికేట్ పాస్‌బుక్‌లు, ఎస్‌ఎంఎస్ అలర్ట్ చార్జీలు కూడా పెరుగుతాయి. జీవితభీమా నాన్‌లైఫ్ ప్రీమియంపై విధించే చార్జీ 15 నుంచి 18 శాతం అవుతుందని ఎల్‌ఐసి ఇప్పటికే పాలసీ హోల్డర్లకు మెసేజీలు పంపించింది. జిఎస్‌టి అమలులోకి రావడం వల్ల దాదాపు అన్ని సర్వీసుల భారం పెరుగుతుందని, అందుకే చార్జీలను పెంచాల్సి వస్తోందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిఇఓ రవీంద్ర కూడా తెలిపారు.