జాతీయ వార్తలు

చిన్న మొత్తాల డిపాజిట్లపై 0.1 శాతం వడ్డీరేటు తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్ల వడ్డీ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును 0.1 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికమైన జూలై నుంచి సెప్టెంబర్ వరకూ ఇది వర్తిస్తుంది. అంటే, తొలి త్రైమాసికంగా చెల్లించిన వడ్డీ రేట్లకంటే 0.1శాతం ఇప్పుడు తగ్గుతుందన్న మాట. గత ఏడాది ఏప్రిల్ నుంచి చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్ల లెక్కింపులో త్రైమాసిక విధానాన్ని అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రజా భవిష్య నిధి (పిపిఎఫ్)పై 7.8 శాతం, కిసాన్ వికాస్ పత్ర (కెవిపి) డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ ఉండనుంది. బాలికా సంరక్షణ, సుకన్య సమృద్ధి డిపాజిట్లపై 8.3, 8.4 శాతం వడ్డీ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం డిపాజిట్లపై 8.3 శాతం వడ్డీ చెల్లిస్తారు. చిన్న మొత్తాల డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, రెండు మూడు రోజుల్లో బ్యాంకులు సైతం ఈమేరకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది.