జాతీయ వార్తలు

మునుపటి భారత్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఇదివరకటి భారత్ కాదు ఆ తేడాను గుర్తించకుండా 1962లో లాగానే ఉందనుకోవద్దని చైనా కు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ధీటైన సమాధానం చెప్పారు. తమ దేశ భూ భాగాన్ని భారత్ ఆక్రమిస్తోందని, ఒక్కసారి 1962లో ఏమి జరిగిందో భారత్ గుర్తుంచుకోవాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై జైట్లీ ఘాటుగా స్పదించారు. ఆక్రమించుకున్న మా భూభాగంనుంచి భారత సైనికులు వెనక్కి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పిఎల్‌ఎ ప్రతినిధి గురువారం హెచ్చరించారు. భారత్ ఎప్పుడూ పరదేశ భూభాగాలను ఆక్రమించుకోలేదని, ఇటువంటివి చైనాకు అలవాటని జైట్లీ ఆరోపించారు. చైనా భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తనకు తెలిసినంతవరకు చైనా భూటాన్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిందని, భూటాన్‌తో భారత్‌కు ఉన్న ఒప్పందం వల్ల పొరుగు దేశ రక్షణలో భాగంగా మాత్రమే తమ సైనికులు అక్కడ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై భూటాన్ ప్రభుత్వం కూడా తమకు స్పష్టతనిచ్చిందని జైట్లీ పేర్కొన్నారు. భారత్‌కు ఈశాన్యాన ఉన్న సరిహద్దు ప్రాంతం సిలిగురి కారిడార్‌కు సమీపంలోని దోకలా వద్ద భారత్, చైనా సైనికుల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.