జాతీయ వార్తలు

సిక్కిం సరిహద్దులకు అదనపు బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: సిక్కింలోని భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో దాదాపునెల రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతుండడంతో భారత్ ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించింది. 1962నాటి యుద్ధం తర్వాత భారత్-చైనా సైనికుల మధ్య ఇంత సుదీర్ఘకాలం ఉద్రిక్తత కొనసాగడం ఇదే మొదటిసారి. జూన్ 1న భారత్-్భటాన్-టిబెట్ ట్రై జంక్షన్‌కు ఓ మూలన ఉన్న చుంబీ వ్యాలీకి దగ్గర్లోని డోకా లా ప్రాంతంలో ఉన్న లాల్టిన్ ప్రాంతంలో 2012లో మనదేశం ఏర్పాటు చేసుకున్న రెండు ఆర్మీ బంకర్లను చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఏ) జవాన్లు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. పిఎల్‌ఏ అనుసరిస్తున్న దుందుడుకు విధానం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా భారత్ అదనపు బలగాలను ఈ ప్రాంతానికి తరలించింది. కేవలం భద్రతను పటిష్ఠం చేసే ఉద్దేశంతోనే అదనపు బలగాలను తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.రెండు దేశాల సైనికుల మధ్య ప్రతిష్టంభనకు దారి తీసిన జూన్ 1 నాటి సంఘటన వివరాలను సైతం మొట్టమొదటిసారిగా ఆ అధికారి వివరించారు. భూటాన్-చైనా సరిహద్దుకు భద్రత కల్పించడంతో పాటుగా ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్న ఐటిబిపి జవాన్లకు అదనపు రక్షణగా ఇక్కడ రెండు బంకర్లను నిర్మించాలని భారత్ 2012లో నిర్ణయించింది. వీటిని తొలగించాలని జూన్ 1న చైనా మన సైనికులను హెచ్చరించింది. చైనా హెచ్చరికల సమాచారం ఉత్తర బెంగాల్‌లోని సుక్నాలో 33 కోర్ ప్రధాన కార్యాలయానికి అందింది. ఈలోగానే జూన్ 6వ తేదీ రాత్రి ఈ ప్రాంతం తమ భూభాగమని అంటూ, చైనా బుల్‌డోజర్లు ఈ బంకర్లను నేలమట్టం చేశాయి. ఈ ఘటన తర్వాత దగ్గర్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంనుంచి అదనపు బలగాలను మన ఆర్మీ ఈ ప్రాంతానికి తరలించింది. ఫలితంగా జూన్ 8న ఇరుపక్షాల మధ్య జరిగిన తోపులాటలో ఇరువైపులా సైనికులకు స్వల్ప గాయాలు తగిలాయి. పిఎల్‌ఏ ఆ ప్రాంతంలో ఉన్న తన 141 డివిజన్‌నుంచి అదనపు బలగాలను తరలించడంతో మన దేశం కూడా అదనపు బలగాలను తరలించాల్సి వచ్చింది. కాగా, 1962 తర్వాత భారత్, చైనా సైన్యాల మధ్య ఇంత సుదీర్ఘకాలం ఉద్రిక్తత కొనసాగడం ఇదే మొదటిసారి. 2013లో జమ్మూ, కాశ్మీర్‌లోని లడఖ్ డివిజన్‌లో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో 21 రోజుల పాటు ఇరు దేశాల సైన్యాల మధ్య ఇలాంటి ప్రతిష్టంభనే నెలకొన్న విషయం తెలిసిందే. తోపులాట తర్వాత భారత సైన్యం హుటాహుటిన ఒక మేజర్ జనరల్ ర్యాంక్ అధికారిని ఆ ప్రాంతానికి పంపించడమే కాకుండా ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చైనాను కోరింది. రెండుసార్లు ఆ అభ్యర్థనను తిరస్కరించిన చైనా మూడోసారి అందుకు అంగీకరించింది. అయితే డోకా లా ప్రాంతంలో భాగమైన లాల్టెన్ ప్రాంతంనుంచి తన బలగాలను ఉపసంహరించాలని చైనా భారత సైన్యాన్ని ఆ సమావేశంలో కోరింది. అది తమ భూభాగమైన డోగ్‌లాంగ్ ప్రాంతంలో భాగమని కూడా చైనా వాదించింది. ఈ ప్రతిష్టంభన తర్వాత చైనా మానస సరోవర్‌కు సిక్కిం గుండా వెళ్లే మార్గమైన నాథులా పాస్ దారిని మూసివేసిన సంగతి తెలిసిందే.