జాతీయ వార్తలు

తెరవెనుక హీరోలు ఎందరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: గత శుక్రవారం అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాలులో గంటకు పైగా అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భారత్ ఒక కొత్త ఆర్థిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా వస్తు, సేవలకు ఒకే పన్ను కలిగిన ఏడవ దేశంగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మీడియా దృష్టికి, నిరంతరంగా సాగుతున్న జనం వ్యాఖ్యలకు దూరంగా స్వాతంత్య్రానంతరం దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణను వాస్తవం చేయడానికి తెరవెనుక నిర్విరామంగా శ్రమించిన అధికారులు ఎందరో ఉన్నారు. జిఎస్‌టి అమలు దశాబ్ద కాలానికి పైగా కొనసాగిన ప్రక్రియ అనే విషయం అందరికీ తెలిసిందే. రాజ్యాంగ సవరణతో పాటుగా దానికి అనుబంధంగా మరో అయిదు చట్టాలను పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తేనే ఇది వాస్తవ రూపం దాల్చింది. 2016 ఆగస్టులో రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పటినుంచి 175 అధికారుల సమావేశాలు, 18 జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అంటే 1800 పని గంటలకు పైగా చర్చలు జరిగాయి. జిఎస్‌టి అమలుకు పెట్టుకున్న జూలై 1 నాటికి సర్వం సిద్ధం కావడం కోసం కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వందలాది మంది అధికారులు అహోరాత్రులు శ్రమించారు. జిఎస్‌టికి సంబంధించిన నిబంధనలను, చట్టాలను రూపొందించడానికి, అలాగే 1200కు పైగా వస్తువులు, సేవలకు పన్ను రేట్లను నిర్ణయించడానికి 30కి పైగా సబ్ గ్రూపులు, కమిటీలు నిర్విరామంగా శ్రమించాయని అధికార వర్గాలు తెలిపాయి.
గత తొమ్మిది నెలల్లో నెలకు సగటున రెండు సార్లు సమావేశమైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే జిఎస్‌టి కౌన్సిల్ తుది నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించి, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను కౌన్సిల్‌కు సమర్పించడానికి ఫిట్‌మెంట్, రేట్ కమిటీలలోని అధికారులు వారానికి మూడు, నాలుగు సార్లు సమావేశం కావలసి వచ్చిందని అధికారులు చెప్పారు. రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులు చాలామంది వారంలో అయిదు రోజులు దేశ రాజధానిలోనే గడిపి వారాంతంలో తమ రాష్ట్రాల్లో పనులు చక్కబెట్టుకోవడానికి వెళ్లే వారని కూడా చెప్పారు.
కొత్త చట్టానికి అవసరమైన గ్రౌండ్‌వర్క్‌నంతా చేయడంలో రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, కేంద్ర ఎక్సైజ్, వాణిజ్య పన్నుల బోర్డు చైర్‌పర్సన్ వనజా సర్నాలు ముందు భాగంలో ఉంటే జిఎస్‌టి కమిషనర్ ఉపేంద్ర గుప్తా, రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో కన్సల్టెంట్ పికె మొహంతి, సంయుక్త కార్యదర్శి అలోక్ శుక్లా, సిబిఇసి చీఫ్ కమిషనర్ మనీష్ సిన్హాతో పాటుగా పలువురు కేంద్ర అధికారులు తెరవెనుక లెక్కలేనన్ని సమస్యలను పరిష్కరించారు. కాగా, పలు రాష్ట్రాలకు చెందిన టాక్స్ అధికారులుకూడా కొత్త కొత్త ఆలోచనలను ప్రతిపాదించారు. జిఎస్‌టి రాజ్యాంగ సవరణ ముసాయిదా చట్టాన్ని రూపొదించడంలో రెవిన్యూ శాఖలో జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమావత్ కీలక పాత్ర పోషించగా, అధికారులను జిఎస్‌టికోసం సన్నద్ధం చేయడంలో ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ జనరల్ పికె దాష్ ప్రధాన పాత్ర వహించారు. దాదాపు 5000 వేల మంది కేంద్ర, రాష్ట్రాల అధికారులకు ఈ జిఎస్‌టికి సంబంధించిన విషయాలపై శిక్షణ ఇచ్చారు. తెరవెనుక ఇంతటి బృహత్ యజ్ఞం జరిగితేనే జిఎస్‌టి అనుకున్న సమయానికి సిద్ధమైంది.

చిత్రం..శుక్రవారం ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సిఇఎ అరవింద్ సుబ్రహ్మణ్యం, సిబిఇసి చైర్మన్ వనజా ఎన్ సర్నా తదితరులు (ఫైల్ ఫొటో)