జాతీయ వార్తలు

భారం కానున్న ఎల్పీజీ గ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: వంట గ్యాస్ ధర భారంకానుంది. ఈనెల నుంచి కనీసంగా రూ.32 అదనంగా చెల్లించాల్సి రావొచ్చు. ఓ వైపు జిఎస్టీ ప్రభావం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత విధిస్తుండటంతో వినియోగదారులు అధిక ధర చెల్లించాల్సి ఉంటుం ది. సేవల విభాగంలోకి ఎల్పీజీని చేర్చటంతో కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి రెండేళ్ల తప్పనిసరి తనిఖీ, ఇన్‌స్టలేషన్, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు, అదనపు సిలిండర్ మంజూరు రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ జీఎస్టీలో 18శాతం పన్ను శ్లాబ్ కిందకు వచ్చాయి. ఇక ఎల్పీజీ జిఎస్టీలో 5శాతం శ్లాబ్‌లో ఉంది. అంతకుముందు ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాలు హరిత ఇంధనంపై వ్యాట్ వేసేవి కావు. కొన్ని రాష్ట్రాలు 2 నుంచి 4శాతం వరకు వ్యాట్ విధించేవి. ఇప్పుడు దేశమంతా ఒకే పన్ను కావటంతో 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ అమలు తరువాత సిలిండర్ ధర ఒక్కోదానికి రూ. 12 నుంచి రూ. 15వరకు పెరుగుతుంది. ఇదే సమయంలో కేంద్రం సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీలో కూడా కోత విధిస్తోంది. ఉదాహరణకు ఆగ్రాలో సిలిండర్‌పై సబ్సిడీ మొత్తం రూ.119.85 నగదు బదిలీ ద్వారా ఖాతాల్లో జమచేసేవారు. ఇప్పుడు ఈ మొత్తం 107 రూపాయలకు పరిమితం అవుతుందని అఖిల భారత ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి విపుల్ పురోహిత్ తెలిపారు. మొత్తం మీద ఒక్కో సిలిండర్‌పై రూ.32 పెరుగుతుందని అంటున్నారు.