జాతీయ వార్తలు

దాడులు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, జూలై 3: ‘్భరత్‌లో మా దాడులు కొనసాగుతాయి. ఇప్పటి వరకు భారత్ ఆక్రమిత శక్తులపైనే మేం దృష్టి పెట్టాం. మా ఆపరేషన్లు ఇలాగే కొనసాగుతాయి’ అని అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ స్పష్టం చేశాడు. తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన కొద్ది రోజులకే ఒక టెలివిజన్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ భారత్‌లో గతంలో తాము జరిపిన దాడులను అంగీకరించాడు. అంతేకాకుండా భారత్‌పై తమ ‘యుద్ధం’ కొనసాగుతుందని హెచ్చరించాడు. అమెరికా వైఖరిని పాకిస్తాన్ ప్రభుత్వం తప్పుపట్టడంతో సలాహుద్దీన్ మరింత రెచ్చిపోయాడు. కాశ్మీర్ లోయను భారత సైనిక బలగాల స్మశాన వాటికగా మారుస్తానని నిరుడు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానన్నాడు. సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం అన్యాయమని పాకిస్తాన్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం అతని వెర్రితనమని సలాహుద్దీన్ వ్యాఖ్యానించాడు. ట్రంప్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించి భారత ప్రధాని నరేంద్రమోదీకి బహుమానాన్ని ఇచ్చిందని ఎద్దేవా చేశాడు. అమెరికా చట్టాల ప్రకారం ఎవరైతే అమెరికన్ పౌరుల భద్రతకు, జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు భంగం కలిగేలా ఉగ్రవాద చర్యలకు పాల్పడతారో అలాంటి వారిని అంతర్జాతీయ టెర్రరిస్టులుగా ప్రకటించవచ్చని అమెరికా చట్టాలు చెప్తున్నాయన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలోని ఏ కోర్టుకైనా వెళ్తే చెత్తబుట్టలో పడేస్తారు. ఈ వెర్రి ట్రంప్ నిర్ణయాన్ని ఏ ఒక్క పాశ్చాత్య దేశం కూడా ఆమోదం తెలపలేదని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో హిజ్బుల్ నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన సలాహుద్దీన్ నిప్పులు చెరిగాడు. ‘మేం టెర్రరిస్టులం కాదు. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం భారత్‌తో మేం పోరాడుతున్నాం’ అన్నాడు. అమెరికా నిర్ణయం కాశ్మీర్ సమస్యను సృష్టించిన సరిహద్దు తీవ్రవాదం నిర్మూలనకు దోహదం చేస్తుందని భారత్ విదేశాంగ ప్రతినిధి గోపాల్ బోగ్లే అన్నారు.
అతని మాటలే నిజం చెప్తున్నాయి: భారత్
సలాహుద్దీన్ భారత్‌పై దాడులు చేస్తామంటూ ఓ టెలివిజన్ చానల్‌తో చేసిన వ్యాఖ్యలు అతను టెర్రరిస్ట్ అని నిరూపిస్తున్నాయని భారత్ పేర్కొంది. అతణ్ణి అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించటం అన్ని విధాలుగా సబబైన పనేనని కేంద్ర హోం శాఖ ప్రతినిధి అశోక్ ప్రసాద్ అన్నారు. అతను టెర్రరిస్ట్ అని అతని వ్యాఖ్యలే ధ్రువీకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు, కాశ్మీర్‌లో వేర్పాటు వాదులకు నిధులు చేరవేయటంలో అతను ఒక ఉపకరణమని ప్రసాద్ అన్నారు. టెర్రరిస్టులకు సలాహుద్దీన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడని ప్రసాద్ స్పష్టం చేశాడు.