జాతీయ వార్తలు

ఉక్కు మీ హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తెలంగాణకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్రసింగ్, ప్రకాశ్ జావడేకర్, బండారు దత్తాత్రేయలను కలిశారు. బీరేంద్ర సింగ్‌ను కలిసిన కెటిఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలిపిందన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నిపుణులతో కూడిన ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశానని, మరో 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుందని పేర్కొన్నారు. నివేదిక రాగానే హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి స్టీల్‌ప్లాంట్ విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కెటిఆర్ మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బయ్యారంతో ఇబ్బందులు ఉంటే ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్ల ప్రాంతాన్ని కలుపుకుని ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఖమ్మం జిల్లాలోని చాలమంది యువకులకు ఉపాధి దొరుకుతుందన్నారు. అలాగే కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. కార్మిక శాఖద్వారా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చెయ్యడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బండారు అభినందించారన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇడ్ల నిర్మాణంపై సంయుక్తంగా సమీక్ష నిర్వహిద్దామని దత్తాత్రేయ కోరినట్లు చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రైల్వే శాఖకు చెందిన 45 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేందుకు సహకరించాలని, రైల్వే శాఖనుంచి స్థలం తెలంగాణ ప్రభుత్వనికి కేటాయిస్తే పెద్దమొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చునని దత్తాత్రేయకు వివరించాన్నారు. బీడీ కార్మికులకోసం 150 పడకల ఆస్పత్రి నిర్మించాలని, హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ ద్వారా అదనవు ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు కెటిఆర్ పేర్కొన్నారు.
తెలంగాణకు ఐఐఎం కేటాయించండి
హైదరాబాద్‌లో వచ్చే విద్యా ఏడాది నుంచి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మేంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు విజ్ఞప్తి చేసింది. జావడెకర్‌తో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, కెటిఆర్, ఎంపీ వినోద్ కుమార్ భేటీ అయ్యారు. అనంతరం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించి వినతిపత్రాలు అందించామన్నారు. వరంగల్‌లో రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై జావడేకర్ సానుకూలంగా స్పందించారని కడియం పేర్కొన్నారు.