జాతీయ వార్తలు

మోదీ ‘కలం’.. భవితకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఇప్పటివరకు ఏ భారత ప్రధాని చేయని ప్రయత్నమిది. అది వినూత్న ఆలోచనలకు దివిటీ పట్టే ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు. నేటి యువతను రేపటి ఆశాసౌధానికి సారధులుగా తీర్చిదిద్దే ఓ బృహత్తర కార్యక్రమాన్ని భుజానకేసుకుంటున్నారు. అదే యువతలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పాదుకొల్పుతూ రేపటి కోసం వారు అహరహరం పరితపించే రీతిలో తన ఆలోచనలను రంగరిస్తూ ఈ అక్షర సంధానం చేస్తున్నారు. యువకులు, ముఖ్యంగా విద్యార్థుల భవితను దిశానిర్దేశం చేసేలా ఆయన ఆలోచనలను పుస్తక రూపంలో తీసుకురానున్నారు. వార్షిక పరీక్షల ముందు విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని, పరీక్షల అనంతరం ఏం చేస్తే బాగుంటుంది వంటి ఎన్నో అంశాలు, సూచనలను పుస్తక రూపంలో పొందుపరచనున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ పబ్లిషర్లు ప్రచురించనున్నారు. విద్యార్థి దశలో ఎంతో కీలకమైన టెన్త్, ఇంటర్ అభ్యసిస్తున్న వారికి ఉపయుక్తంగా ఉండే అంశాలు ఇందులో చోటుచేసుకోనున్నాయి. ఒక స్నేహితుడిగా, సరైన దిశానిర్దేశం చేసే వ్యక్తిగా మోదీ ఉండాలనుకుంటున్నారని, విద్యార్థులకు అవసరమయ్యే అత్యంత కీలకమైన అంశాలపై సరైన అవగాహన కల్పించాలన్నది ఆయన ఉద్దేశమని ప్రచురణకర్తలు వెల్లడించారు. మార్కుల కన్నా విజ్ఞానం ఎంతో ముఖ్యమైందనే విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా విపులంగా వివరించడంతో పాటు భవిష్యత్తు ఎంత బాధ్యతాయుతమైందో వారి దృష్టికి తీసుకెళ్లడం మోదీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పుస్తక రచన మోదీ స్వీయ ఆలోచన. ప్రతి వారం ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించడంతో తన మనసులోని భావాలను పుస్తక రూపంలో తీసుకురావాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ‘నా హృదయానికి, ఆ ఆలోచనకు దర్పణం పట్టే అంశంపైనే ఓ పుస్తకం రాయాలనుకుంటున్నాను. యువతే సారధిగా, వారే సర్వస్వంగా సాగే రేపటికోసమే ఈ పుస్తక ఆలోచన’ అని మోదీ పేర్కొన్నట్లుగా పబ్లిషర్లు వెల్లడించారు.